ఎవరైనా సరే కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మన బాక్స్ బద్దలైపోతుంది. మనలాంటి నార్మల్ పర్సన్ వరకు ఓకే గానీ సినిమా, క్రికెట్ స్టార్స్.. సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్, కామెంట్ పెట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. ఒకవేళ అలా కాదని ఏది పడితే అది రాస్తే మాత్రం.. పెద్ద పెద్ద వివాదాల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ కూడా అలానే నోరు జారి పెద్ద గొడవలో చిక్కుకుంది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానూ మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. హిందీ మూవీస్, వెబ్ సిరీస్ చూసేవాళ్లకు హీరోయిన్ రిచా చద్దా పరిచయమే. బోల్డ్ పాత్రలకు కేరాఫ్ అయిన ఆమె.. ఇన్ సైడ్ ఎడ్జ్ వెబ్ సిరీస్, గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్, ఫక్రే, షకీలా తదితర సినిమాల్లో నటించింది. ఈమె హీరోయిన్ గా చేసిన ‘ఫక్రీ 3’.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది పక్కనబెడితే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి పాకిస్థాన్ ని వెనక్కి పంపడానికి తాము పూర్తి సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం ఆర్డర్ పాస్ చేస్తే, ఆపరేషన్ త్వరగా ముగిస్తాం అని నార్త్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఇటీవల మాట్లాడారు. దీనిపై స్పందించిన రిచా.. ‘గాల్వాన్ సేస్ హాయ్’ అని ట్వీట్ చేసింది. ఇది కాస్త ఇప్పుడు దుమారమైపోయింది.
ఎందుకంటే ఇండో-చైనా మధ్య జరిగిన ‘గాల్వాన్’ ఘటనలో 20 మంది మన సైనికులు అమరులయ్యారు. వాళ్ల త్యాగాన్ని మర్చిపోయి.. ప్రత్యర్థి దేశానికి మద్దతిచ్చేలా రిచా చద్దా వ్యవహరించింది. దీంతో ఆమెపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో తాను చేసిన ట్వీట్ ని డిలీట్ చేసేసింది. తను ట్విట్టర్ ద్వారా బహిరంగ క్షమాపణ కోరుతున్నట్లు ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ‘నేను చేసి ట్వీట్ వివాదానికి కారణమైంది. నా ఉద్దేశం ఎవరినీ బాధపెట్టాలని కాదు. భారత సైన్యంలో పనిచేసే నా సోదరులకు అది బాధ కలిగించి ఉంటే క్షమించాలని కోరుతున్నాను. మా తాతయ్య కూడా భారత ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గా పనిచేశారు. 1960 ఇండో-చైనా వార్ లో ఆయన కాలికి గాయమైంది కూడా. మా మామయ్య కూడా పారామిలిటరీలో పనిచేశారు. దేశభక్తి నా రక్తంలోనే ఉంది. దేశం కోసం సైనికుడు గాయపడినా, చనిపోయినా అతడి కుటుంబం ఎంత బాధపడుతుందో నాకు తెలుసు.’ అని రిచా పోస్టులో పేర్కొంది. మరి రిచా ట్వీట్ దుమారంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
@BediSaveena pic.twitter.com/EYHeS75AjS
— RichaChadha (@RichaChadha) November 24, 2022