తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ప్రత్యేకమైన స్థానం ఉంది. శివ సినిమాతో వర్మ చిత్ర పరిశ్రమలో సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేశాడు. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించటంతో ఆర్జీవీ రేంజ్ ఒక్కసారిగా మారి పోయింది. అయితే వర్మ సమకాలీన అంశాలపై స్పందిస్తూ తనదైన శైలీలో వాదనను వినిపిస్తూ కాంట్రవర్సికి కేరాఫ్ గా మారుతూ ఉంటాడు.
ఇక ఈ మధ్య కాలంలో బోల్డ్ ఇంటర్వ్యూలు చేస్తూ సంచలనాలకు దారి తీస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే తనకు నచ్చిన కాన్సెప్ట్ తో విన్నూత్నంగా ఆలోచించి సినిమాలు తీసే ఆర్జీవీ ఈ సారి నటుడు ఉపేంద్రతో ఓ సినిమా చేయనున్నాడని ఆయనే అధికారికంగా తెలిపాడు. నేడు ఉపేంద్ర పుట్టిన రోజు కావంటంతో ఆర్జీవీ ట్విట్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ఇద్దరి కలయికలో త్వరలో సినిమా రాబోతుందని వర్మ చెప్పాడు.
దీనికి సంబంధించి వర్మ తన ట్విట్టర్ ఖాతాలో ఉపేంద్రతో దిగిన ఫోటోను పోస్ట్ చేస్తూ వీరిద్దరి సినిమా గురించి తెలిపాడు. ఇక ఇండస్ట్రీలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న ఉపేంద్ర రామ్ గోపాల్ వర్మ సినిమాలో చేయనుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి వీరిద్దరిలో సినిమా ఎప్పుడు రానుందా అని వర్మ, ఉపేంద్ర అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
HAPPY to announce that Me and @nimmaupendra are starting an action film VERY SOON and here’s wishing him MANY HAPPY RETURNS OF THE DAY #HappyBirthday #upendra pic.twitter.com/nFaNhZYYNt
— Ram Gopal Varma (@RGVzoomin) September 18, 2021