సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అనేక వివాదాలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. ఆయన ఏం మాట్లాడిన కూడా సోషల్ మీడియాలో ఈజీగా వైరల్ అవుతోంది. తెలివిగా కాంట్రవర్సీలు చేయడంలో ఆర్టీవీ ముందుంటారు. ఏ విషయంలో అయినా చాలా ఓపెన్ గా ఉంటాడనే చెప్పాలి. ఇక తన వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆయనకు నచ్చిన, అనిపించినది చేసేస్తాడు. ఎవరు ఏమి అనుకుంటారు అనే ఆలోచనలే ఆర్టీవీలో రావు. అంతే కాక అమ్మాయిలను ఆకట్టుకునేలా కూడా వర్మ ఎంతో తెలివిగా మాట్లాడుతాడు. అప్పుడప్పుడు అమ్మాయిలతో డ్యాన్స్ కూడా చేస్తు ఉంటాడు. గతంలో కొందరు నటీమణులతో కలిసి ఆర్టీవీ డ్యాన్స్ చేశాడు. తాజాగా ఓ పార్టీలో భాగంగా మిడిలేజ్ లేడీస్ తో వర్మ డ్యాన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలు అంటే ఇండస్ట్రీలోనే ట్రెండ్ సెట్ చేసేవి. అందుకు ఉదాహరణ ‘శివ’ సినిమానే. గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన ఆర్టీవీ..గత కొంతకాలంగా తన అడల్డ్ సినిమాల వైపు వెళ్తున్నారు. తనకు నచ్చిన విధంగా సినిమాలు తీస్తానని, ఎవరికి ఇష్టమైతే వారు చూస్తారు, నచ్చని వాళ్లు చూడవలసిన అవసరం లేదు అంటూ ఆర్జీవీ కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతారు. తెలివైన మాటలతో ఎన్నో ప్రశ్నలు వదులుతూ అందరిని ఆలోచింపజేస్తున్నాడు. లాజికల్ గా మాట్లాడుతూ యువతకు అతను మరింత దగ్గర అవుతున్నాడు. ఏ విషయం పైన అయినా సరే తనదైన శైలిలో స్పందిస్తూ తన టాలెంట్ ఏంటో చూపిస్తున్నాడు. ఇటీవల కెరీర్ పరంగా తెలుగులో తీస్తున్న సినిమాలతో ఆశించిన స్థాయి సక్సెస్ లు అయితే అందుకోలేకపోతున్నారు.
ఇటీవల కొండ సురేఖ దంపతుల బయోపిక్ ను ‘కొండ’ అనే పేరుతో సినిమాను తెరకెక్కించారు. అలానే నైనా గంగూలీ, అప్సర రాణితో ‘డేజంరస్’ అనే మూవీని తీశారు. ఇలా తన సినీ కెరీర్ ను కొనసాగిస్తోన్నా ఆర్టీవీ.. పర్సనల్ లైఫ్ ను తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. తనకు నచ్చినట్లే తాను ఉంటున్నారు. ఆడియో ఫంక్షన్లలో, ఇంటర్వ్య సమయాల్లో యువతులతో రొమాంటిక్ డ్యాన్స్ లు చేస్తుంటాడు. ఎంత మంది విమర్శలు చేసిన.. డోంట్ కేర్ అంటూ తన పద్ధతిలో తాను ముందుకెళ్తుంటాడు. గతంలో బిగ్ బాస్ నటి అరియనా గ్లోరీ తో కలిసి తన జిమ్ లో డ్యాన్స్ చేశారు. అంతే కాక బర్త్ డే వేడుకలకు హాజరైన సమయంలో అక్కడ కూడా హీరోయిన్లతో రోమాంటిక్ డ్యాన్స్ చేస్తుంటాడు.
ఆర్టీవీకి సంబంధించిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా మిడిలేజ్ ఉమెన్స్ తో కలిసి ఆర్జీవీ డ్యాన్స్ చేశాడు. ఓ పార్టీ సందర్భంగా పబ్ కు వెళ్లిన రామ్ గోపాల్ వర్మ.. ‘ఊ..అంటవా..మావ.. ఊ ఊ ..అంటవా’ అనే పాటకు కొందరు మధ్య వయస్సు మహిళలతో కలిసి రోమాంటిక్ డ్యాన్స్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. బ్రతికితే ఆర్జీవీలాగా బ్రతకాలిరా అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. లైఫ్ అంటే ఆర్జీవీ దే రా.. అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.