అతడు బాలీవుడ్ స్టార్ హీరో. అయితేనేం 'జిగేలు రాణి' పాటకు సూపర్ స్టెప్పులతో చితక్కొట్టేశాడు. రెచ్చిపోయి మరీ డ్యాన్స్ చేశాడు. ఇంతకీ ఎవరా హీరో? ఇది ఎప్పుడు జరిగింది?
బాహుబలి ముందో లెక్క.. తర్వాతో లెక్క. టాలీవుడ్ రేంజ్ మారిపోయింది. తెలుగు సినిమాల క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఒకప్పుడు బాలీవుడ్ మూవీస్ కోసం మన ఆడియెన్స్ ఎదురుచూసేవారు. ఇప్పుడు మన సినిమాల కోసం నార్త్ ప్రేక్షకులు తెగ వెయిట్ చేస్తున్నాయి. అలా మన సినిమాల క్రేజ్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. ఇక బాలీవుడ్ స్టార్ హీరోల దగ్గర నుంచి హీరోయిన్ల వరకు ప్రతి ఒక్కరూ తెలుగు పాటలకు స్టెప్పులేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా యంగ్ స్టార్.. ‘జిగేలు రాణి’ పాటకు స్టెప్పులేసి ఫుల్ గా ఎంటర్ టైన్ చేశాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. పాన్ ఇండియా కల్చర్ పెరిగిపోయిన తర్వాత అన్ని ఇండస్ట్రీలకు బౌండరీస్ చెరిగిపోయాయి. దీంతో వేరే భాషల హీరోలు, డైరెక్టర్స్ టాలీవుడ్ లో.. తెలుగు హీరోలు, దర్శకులు వేరే భాషల్లో సినిమాలు చేస్తూ ఫేమ్ తెచ్చుకుంటున్నారు. అలా ‘అర్జున్ రెడ్డి’తో గుర్తింపు క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్ కే షిప్ట్ అయిపోయారు. ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’తో సూపర్ హిట్ కొట్టాడు. రణ్ బీర్ కపూర్ తో ‘యానిమల్’ ప్లాన్ చేశాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది.
‘అర్జున్ రెడ్డి’ మించిన స్టోరీతో ‘యానిమల్’ తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో రణ్ బీర్.. గడ్డంతో ఉన్న ఫొటోలు ఇప్పటికే వైరల్ గా మారాయి. తాజాగా ముంబయిలో షూటింగ్ అంతా పూర్తయిన సందర్భంగా గ్రాండ్ గా పార్టీ చేసుకున్నారు. ఇందులో సూపర్ హిట్ సాంగ్స్ అందరూ డ్యాన్స్ చేస్తూ తెగ ఎంజాయ్ చేశారు. అయితే రామ్ చరణ్ ‘రంగస్థలం’లోని జిగేలు రాణి పాటకు రణ్ బీర్ మాస్ స్టెప్పులు వేయడం అందరితో విజిల్స్ వేయించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ డ్యాన్స్ చూసిన తర్వాత మీకేం అనిపించింది. కింద కామెంట్ చేయండి.
More❤️#RanbirKapoor #Animal pic.twitter.com/ZcCnoQNZXs
— Ranbir Kapoor Online (@ranbirkapooron) February 21, 2023