దగ్గుబాటి రానా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆరడగుల అందగాడు మాత్రమే కాక.. నటనలో కూడా అద్భుతమైన ప్రతిభ కలిగి ఉన్నాడు. ఇక రానా కెరీర్‌ని ఓసారి పరిశీలిస్తే.. ఆశ్చర్యం వేస్తుంది. సాధారణంగా హీరోగా చేసిన వ్యక్తి ఎవరు విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేయడానికి ఇష్టపడరు. కానీ రానా మాత్రం అవేం పట్టించుకోడు.. క్యారెక్టర్ నచ్చిందా అంతే. అందుకు బాహుబలి సినిమానే ఉదాహరణ. ఈ చిత్రంలో రానా.. భల్లాల దేవగా ఓ రేంజ్లో విలనీజం ప్రదర్శించాడు. తాజాగా వచ్చిన విరాటపర్వం సినిమాలో కూడా వైవిధ్యమైన పాత్ర పోషించాడు. ప్రస్తుతం చేతిలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు రానా. ఇక త్వరలోనే బాబాయ్ వెంకటేష్‌తో కలిసి రానా నాయుడు వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ క్రమంలో రానాకు సంబంధించి ఓ వార్త వైరలవుతోంది.
2021, ఆగస్ట్ 8న రానా, మిహిక బజాజ్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ల క్రితం వరకు వీరిద్దరూ విడిపోతున్నారు అనే వార్తలు ప్రచారం అయ్యాయి. రానా-మిహికా సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఫోటోలన్ని డిలీట్ చేశారు. దాంతో వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ జోరుగా ప్రచారం సాగింది. ఈ క్రమంలో రానాతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసి.. పుకార్లకు చెక్ పెట్టింది మిహికా. కాగా.. తాజాగా మిహికా-రానాలకు సంబంధించి ఓ వార్త వినిపిస్తోంది. అదేంటంటే.. త్వరలోనే వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారట. దగ్గుబాటి అభిమానులు, ప్రేక్షకులకు త్వరలోనే ఈ దంపతులు గుడ్ న్యూస్ చెబుతారని ఫిల్మ్ నగర్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
ఇక టాలీవుడ్లో దగ్గుబాటి కుటుంబానికి ఉన్న పేరు ప్రఖ్యాతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దగ్గుబాటి రామా నాయుడు నిర్మాతగా తనదైన ముద్ర వేశారు. ఆయన కుమారుల్లో సురేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరిగా కొనసాగుతుండగా.. మరో కొడుకు వెంకటేష్ హీరోగా రాణిస్తున్నాడు. ఇక సురేష్ బాబు తనయుడు రానా.. హీరోగా నటిస్తూనే.. తండ్రి బాటలో నడుస్తూ సినిమాలను నిర్మిస్తు కొత్త వారిని ప్రోత్సాహిస్తున్నాడు. ఇక బాబాయ్ వెంకటేష్‌తో కలిసి రానా నటించిన వెబ్ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.