ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్స్ గా మారిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ సక్సెస్ ఇచ్చిన ఆనందాన్ని ఎంజాయ్ చేస్తూనే తదుపరి సినిమాలకోసం సిద్ధమవుతున్నారు. అయితే.. ట్రిపుల్ ఆర్ కి ముందే చరణ్ – తారక్ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయినప్పటికీ ఈ సినిమాతో మరింత దగ్గరయ్యారు. ఇదివరకే ఇద్దరూ ఒకరితో అనుబంధాన్ని, అభిమానాన్ని పలు ఇంటర్వ్యూలలో బయటపెట్టారు.
తాజాగా ఆచార్య ప్రమోషన్స్ లో భాగంగా చరణ్ మరోసారి తారక్ పై తన అభిమానాన్ని వెలిబుచ్చాడు. కొరటాల శివ తెరకెక్కించిన సినిమాల గురించి మాట్లాడుతూ మధ్యలో జనతా గ్యారేజ్ ప్రస్తావన లేవనెత్తాడు. ఆ సినిమాలో తారక్ చాలా కొత్తగా కనిపించాడు.. బాగా నచ్చాడని చెప్పాడు. అలాగే టెంపర్ లో క్యారెక్టర్ కి, జనతా గ్యారేజ్ లో క్యారెక్టర్ కి మధ్య వేరియేషన్స్ బాగా నచ్చాయని ప్రశంసించాడు.
ఇక తారక్, చరణ్ ఇద్దరూ కూడా అవకాశం వచ్చిన ప్రతిసారి ఒకరిపై మరొకరు అభిమానాన్ని చాటుకుంటున్నారు. ప్రస్తుతం చరణ్ కీలకపాత్ర పోషించిన ఆచార్య సినిమా విడుదలకు రెడీ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమాను కొరటాల శివ రూపొందించారు. ఇదిలా ఉండగా.. ఆచార్య తర్వాత కొరటాల తదుపరి సినిమాను ఎన్టీఆర్ తో చేయబోతుండటం విశేషం. మరి చరణ్ – తారక్ ల స్నేహంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.