తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి ఎంత అభిమానం ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగా కాంపౌండ్ నుంచి సినిమా వస్తోంది అంటే చాలు ప్రేక్షకులు మురిసిపోతారు. మరి అలాంటిది మెగా కుటుంబం నుంచి ఏదైన వేడుకలోని పిక్ వస్తే అది క్షణాల్లో వైరల్ గా మారుతుంది. తాజాగా అలాంటి ఓ ఫొటోనే ఉపాసన తన ఇన్ స్టా లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. ఆ పిక్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
రామ్ చరణ్-ఉపాసన ఎంత అందమైన జోడినో మనందరికి తెలిసిందే. అందమైన జోడీనే కాక అంతకంటే అందమైన మనసు వారిది. ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా తమ అభిమానులకు సహాయం చేస్తూనే ఉంటారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలతో బిజీగా ఉంటే చరణ్ సతీమణి ఉపాసన అపోలో ఆసుపత్రులకు సంబంధించిన విషయాలు చూసుకుంటూ బిజీగా ఉంటుంది. అయితే తాజాగా ఈ దంపతులకు సంబంధించిన ఒక ఫొటో అభిమానులను అనందంలో ముంచుతోంది.
చరణ్- ఉపాసన దంపతులు ఇద్దరు పూజగదిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగానే చరణ్ ఉపాసన నుదుటిపై బొట్టు పెట్టాడు. ఈ ఫొటోను ఉపాసన తన ఇన్ స్టా లో పొస్ట్ చేసింది. క్యాప్షన్ గా క్వారంటైన్ పూజా.. హ్యాపీ శ్రీకృష్ణ జన్మాష్టమి, వరలక్ష్మీ వ్రతం అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ గా మారింది. దీని పై నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ.. ఎంత అన్యోన్య దాంపత్యం.. చూడచక్కని జంట.. క్యూట్ అంటూ రాసుకొచ్చారు. మరి తెలుగు సాంప్రదాయం ఉట్టిపడే ఈ పిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.