తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. తెలుగులో దాదాపు అందరూ హీరోల సరసన సినిమాలు చేసేసింది రకుల్. ప్రస్తుతం రకుల్ చేతినిండా సినిమాలతో బిజీ అయిపోయింది. అమ్మడికి తెలుగులో జయజానకినాయక సినిమా తర్వాత హిట్టు పడలేదు. కింగ్ నాగ్ తో మన్మధుడు-2 మూవీలో చేసిన రొమాన్స్ ప్లాప్ అయింది. అలాగే గతేడాది విడుదలైన చెక్, కొండపొలం సినిమాలు నిరాశపరిచాయి.
ఇక హిందీలో 6 సినిమాలతో.. తమిళంలో పాన్ ఇండియా మూవీ ఇండియన్-2, హీరో శివకార్తికేయన్ సరసన అయలన్ సినిమాలు చేస్తోంది. మొత్తానికి రకుల్ తెలుగు తప్ప మిగతా భాషల్లో ఫుల్ స్వింగ్ లో ఉందనే అనిపిస్తుంది. అయితే, సినిమాల విషయం పక్కనపెడితే.. ఇండస్ట్రీలో చాలా కాలంగా రకుల్ పెళ్లి ఎప్పుడంటూ కథనాలు వెలువడుతున్నాయి. అలాగే హనీమూన్ స్పాట్ మాల్దీవ్స్ గోల కూడా బాగానే వినిపిస్తుంది. రకుల్ గతేడాది తన బర్త్ డే రోజున బాయ్ ఫ్రెండ్ ఎవరో బయట పెట్టేసిన సంగతి తెలిసిందే. హిందీ ప్రొడ్యూసర్ తనయుడు, నటుడు జాకీ భగ్నానీతో అమ్మడు ప్రేమాయణం నడుపుతోంది. 2022 న్యూ ఇయర్ వేడుకలను బాయ్ ఫ్రెండ్ తో కలిసి లండన్ లో జరుపుకుంది. తాజాగా ఈ ప్రేమజంట లండన్ నుండి ముంబైకి వచ్చేశారు. గతేడాది రకుల్ తన మకాం కూడా ముంబైకి మార్చేసింది.
ఇటీవలే ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ తన పెళ్లి పుకార్లపై స్పందించింది. రకుల్ మాట్లాడుతూ.. ‘అది పెళ్లి లేదా ఇంకా ఏదైనా కావచ్చు.. వట్టి పుకార్లు సృష్టించి నన్ను ఇబ్బంది పెట్టకండి. కెరీర్ పరంగా నేనిప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. అయినా నా పెళ్లి గురించి ముందుగా నేనే మాట్లాడుతా కదా! జనాలకు రూమర్స్ నమ్మొద్దని చెబుతున్నాను. ప్రస్తుతం నా ఫోకస్ అంతా సినిమాలపై ఉంది. నా పెళ్లి ఎప్పుడనేది నేనే చెప్తాను’ అంటూ చెప్పుకొచ్చింది. కానీ రకుల్ – జాకీ చెట్టాపట్టాలేసుకొని తిరగటం చూస్తుంటే ఏదో పెద్ద సీక్రెట్ దాస్తున్నారంటూ నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. చేతిలో సినిమాలు చూస్తే ఇప్పట్లో పెళ్లి ముచ్చట చెప్పేలా లేదు. చూడాలి రకుల్ చెప్పిన ఆ పెళ్లి రోజు ఎప్పుడొస్తుందో! మరి ఈ ప్రేమజంట పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.