రకుల్ ప్రీత్ సింగ్.. తెలుగు ప్రేక్షకులు పరిచయం అక్కర్లేని పేరిది. ‘కెరటం’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ పంజాబీ బ్యూటీ. అనంతరం టాప్ హీరోలతో నటించి.. అగ్రహీరోయిన్ గా వెలుగొంది. అయితే ఈ మధ్యకాలంలో టాలీవుడ్ కు కాస్తా దూరమైనట్టు కనిపిస్తోంది. గతంలో వరుసగా తెలుగు చిత్రాల్లో నటిస్తూ ఆడియెన్స్ ను ఊర్రూతలూగించిన ఈ భామా ప్రస్తుతం బాలీవుడ్ బాట పట్టింది. వరుస హిందీ చిత్రాల్లోనే నటిస్తోంది. ఇంత బిజీలోనూ రకుల్ ఒక ప్యాన్ ఇండియా మ్యూజికల్ వీడియో చేసింది.”మాషుకా” అంటూ సాగే ఈ పాట హిందీ వెర్షన్ ఇప్పటికే విడుదలైంది. దీని ఆమె ప్రియుడు జాకీ భగ్నాని నిర్మించారు.
తాజాగా తెలుగు, తమిళ వెర్షన్స్‌ని ఈ పాటను అల్లు అర్జున్ సోషల్ మీడియాలో లాంచ్ చేశాడు. తనిష్క్ బాగ్చి సంగీతం అందించిన ఈ పాటను తెలుగులో ఆదిత్య అయ్యంగార్, అసీస్ కౌర్ పాడారు.”నీ నవ్వుకు పడిపోయా, నీ చూపుకు పడిపోయా, నా నిదరే చెడిపోయా” అంటూ సాగే తెలుగు పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. ఇందులో ఆకట్టుకుని లుక్ తో కనిపించిన రకుల్ చక్కటి స్టెప్పులతో అలరించింది. తన అందంతో కుర్రకారు మతిపోగొడుతుంది.
ఈపంజాబీ అమ్మడు హీరోయిన్ గా నటించిన హిందీ చిత్రాలు “అటాక్”, ‘రన్‌వే 34’ ఈ మధ్యే విడుదలై బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ భామ మిషన్ సిండ్రెల్లా, డాక్టర్ జి, థ్యాంక్ గాడ్, ఛత్రీవాలీ అనే సినిమాల్లో నటిస్తోంది. ఇంత బిజీలోనూ కూడా రకుల్ ఈ ప్యాన్ ఇండియా మ్యూజికల్ వీడియో చేసింది. మరి.. వీడియోపై మీరు ఓలుక్కేసి..మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Icon StAar @alluarjun
presents the Music video of @jjustmusicofficial’s ‘Mashooka’ in Tamil & Telegu The song is 🔥🔥Telugu : https://t.co/XI0C4U1LDv
Tamil: https://t.co/eIxDlfYFcH@rakulpreet @jackkybhagnani
@tanishk_bagchi @aseeskaurmusic @adityaiyengarmusic @devnegilive— Ramesh Bala (@rameshlaus) July 29, 2022