గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటుడు, నిర్మాతలు, దర్శకులే కాదు.. ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు కన్నుమూస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం కన్నీటి సంద్రంలో మునిగిపోతున్నారు. తాజాగా ప్రముఖ గుజరాతీ నటుడు రసిక్ దవే కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన రసిక్ దవే మూత్రపిండాల సంబంధిత వ్యాధులతో పోరాడుతున్నాడు. గత రెండు సంవత్సరాలుగా డయాలసిస్ చేయిస్తున్నారు కుటుంబ సభ్యులు. రసిక్ దవే ఆరోగ్యం క్షీణించడంతో కన్నుమూశారు. ఆయన సతీమణి నటి కేత్కి దవే. ఈమె ‘క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ’లో దక్ష విరాణి పాత్రతో మంచి పేరు సంపాదించింది. వీరికి కుమార్తె రిద్ధి దవే, కుమారుడు అభిషేక్. నటుడు,నిర్మాత జెడి మజేథియా ‘మీ అకాల మరణం గురించి విన్న తర్వాత నా మనసు ఎంతో బాధపడిందని... అన్నయ్య. దేవుడు మీ కుటుంబానికి కష్టాలను అధిగమించే శక్తిని ప్రసాదించుగాక’అంటూ ట్వీట్ చేశారు. రసిక్ దవే సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Heartbroken and deeply saddened to hear about the untimely demise of Rasik Dave. Gone too soon brother. May God give your family the strength to get through his difficult time. Om Shanti pic.twitter.com/kpmJU0Cz06 — JDMajethia (@JDMajethia) July 29, 2022