ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రభంజనం సృష్టిస్తోంది. రాజమౌళి గ్రాఫిక్ మాయాజాలం, రామ్ చరణ్, ఎన్టీఆర్ ల నటనా ప్రతిభ ఈ సినిమాను భారతదేశ సినీ చరిత్రలో ముందు వరుసలో నిలిపాయి. నేడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు కార్యక్రమం బంధు, మిత్రులతో ఆనందంగా జరుపుకుంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో మెగా అభిమానులు చెర్రీ పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటున్నారు.
ఇప్పటికే చాలా మంది అభిమానులు, సెలబ్రిటీలు తమ స్టైల్‌లో చరణ్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. రామ్ చరణ్ పుట్టినరోజు కాగా, దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ల హంగామా అంతాఇంతా కాదు. రామ్ చరణ్ సతీమణి ఉపాసన, ఎన్టీఆర్ అర్ధాంగి ప్రణతి కూడా ఈ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. రామ్ చరణ్ స్నేహితుడు.. హీరో యన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ఒఖ వీడియో తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. కాగా, ఈ వేడుకలు రామ్ చరణ్ నివాసంలో జరిగినట్టు తెలుస్తోంది.