బిగ్‌బాస్ బ్యూటీ అషూ రెడ్డి ఈ మధ్య తన అందంతో కాస్త ప్రేక్షకులను రెచ్చగొడుతున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రతీది పోస్ట్ చేస్తూ ఉంటుంది. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక చిన్నచిన్న ప్రోగ్రామ్‌లు చేస్తూ తన రూట్‌ను మార్చేసుకుంటోంది ఈ బ్యూటీ. ఇక వరుస ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన అందంతో కుర్రకారు మతిపోగొడుతోంది.
ఇక అషూరెడ్డి తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫోటో తీయటం కూడా కాస్త చర్చనీయాంశమైంది. ఇక అసలు విషయం ఏంటంటే? రాహుల్ సిప్లిగంజ్, అషూ రెడ్డి మధ్య ఏదో ఉందని అందరూ అనుకుంటున్నారు. వారిద్దరూ కలిసినప్పుడు కలిసి ఫోటోలు దిగటం, క్లోజ్‌గా మూవ్ అవ్వటం వంటివి ప్రేక్షకులకు అనుమానాలను కల్గిస్తున్నాయి.
అయితే తాజాగా రాహుల్ సిప్లిగంజ్ అషూ రెడ్డితో నువ్వెవ్వరో అంటూ ఓ సాంగ్ ఆల్బమ్ తీశారు. ఇందులో వీరిద్దరి కెమిస్ట్రీ మాములుగా లేదనే చెప్పాలి. ఇక అషూ రెడ్డి రాహుల్‌కు ముద్దుపెడుతున్న ఓ ఫోటోను సోషల్ మీడియలో పోస్ట్ చేసింది. ఇక ఆల్బమ్ ప్రమోషన్‌లో భాగంగా ఈ ఫోటో పెట్టినట్లు తెలుస్తోంది. పోస్ట్ చేయటంతో పాటు ఈ ఫోటోను ఆల్బామ్‌లోనుంచి తీశానని, ఇది న్యూస్ ఛానల్స్‌కు చెప్పాలనుకుంటున్నానని తెలిపింది.