పునీత్ రాజ్ కుమార్.. దేశవ్యాప్తంగా ఏ వార్త చూసినా.. సోషల్ మీడియా చూసినా అదే పేరు మారుమోగుతోంది. ఒక కన్నడ పవర్ స్టార్‌గానే కాకుండా ఒక వ్యక్తిగా ప్రజల హృదయాల్లో ఆయనకున్న స్థానాన్ని మాటల్లో వర్ణించలేము. తన మృతితో దక్షిణాది సినీ పరిశ్రమలో తారలు, సెలబ్రిటీలు, అభిమానులను కన్నీళ్లు పెట్టిస్తున్నాడు. బెంగళూరు కంఠీరవ స్టేడియంలో పునీత్ రాజ్ కుమార్ పార్థీవదేహానికి అభిమానులు, సెలబ్రిటీలు నివాళులర్పించారు. పునీత్ నమ్మేది ఒకటే సిద్ధాతం. ఎక్కడ ఉంటున్నాం.. ఏం తింటున్నాం.. ఎలా ఉంటున్నాం.. అంతా విధి రాతే. నీ జీవితం అంతా నీ తలరాత మీదే ఆధారపడి ఉంటుంది అంటూ ఉండేవాడు పునీత్. తన జీవితంలోనూ అదే నిజమైంది.
పునీత్ మృతి చెందడానికి ముందురోజు… పునీత్ రాజ్ కుమార్- ఉపేంద్ర పార్టీలో పాల్గొన్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఎంతో హుషారుగా పునీత్ పాట పాడుతూ ఉపేంద్రను డాన్స్ చేయాల్సిందిగా అడుగుతుంటాడు. ఉపేంద్రానేమో ఏదైనా క్లాస్ సాంగ్ పాడంటూ కోరుతున్నాడు. ఆ వీడియోని ఇప్పుడు షేర్ చేస్తూ అభిమానులు ఎంతో విలపిస్తున్నారు. పునీత్ రాజ్‌కుమార్ మళ్లీ తిరిగి వస్తే బావుండు కదా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.