‘మా’ ఎన్నికలు ఎన్నో మలుపులు తిరుగుతున్నాయి. బండ్ల గణేష్ మొదట ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌లో ఉ్ననాడు. మధ్యలో ఏవో కారణాల వల్ల తాను ఇండిపెండెంట్‌గా జనరల్ సెక్రెటరీ పదవికి నామిమేషన్ దాఖలు చేశారు. తాను కచ్చితంగా ఎన్నికల్లో నిలబడతారు అనే అందరూ భావించారు. ఇప్పుడు సడెన్‌గా తాను ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. బండ్ల గణేష్ నామినేషన్ విత్ర్‌డ్రా చేసుకుంటున్న అప్లికేషన్ ఒకటి ట్విట్టర్‌లో ప్రత్యక్షమైంది. దానిని మళ్లీ బండ్ల గణేష్ స్వయంగా రీట్వీట్ చేయడంతో క్లారిటీ వచ్చింది. బండ్ల గణేష్ ఎందుకు తప్పుకుంటున్నాడని ప్రశ్న ఇప్పుడు బాగా వినిపిస్తోంది. అందుకు సమాధానం కూడా ఆయన ట్విట్టర్ ఖాతాలోనే ఉంది.
‘నా దైవ సమానాలు.. నా ఆత్మీయులు.. నాశ్రేయోభిలాషుల సూచన మేరకు నేను ‘మా’ జనరల్ సెక్రెటరీ నామినేషన్‌ను ఉపసంహరించుకున్నాను’ అని బండ్ల గణేష్ రీట్వీట్ చేసిన ట్వీట్‌లో ఉంది. తన నామినేషన్‌ను బండ్ల గణేష్ ఉపసంహరించుకున్నాడు. అందుకు ఎవరు ప్రోత్సహించారు అనే అనుమానం ఉంది అభిమానుల్లో. బండ్ల గణేష్ వాడిన పదాలు చూస్తే ఆయన అంతగా పొగిడే వ్యక్తి, పోల్చే వ్యక్తి పవన్ కల్యాణ్ అనే అందరూ అనుకుంటారు. మరి నిజంగానే పవన్ కల్యాణ్ నామినేషన్ ఉపసంహరించుకోమని చెప్పారో లేదో బండ్లన్నకే తెలియాలి. బండ్ల గణేష్ ‘మా’ ఎన్నికల నుంచి తప్పుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.