ఒకప్పుడు హీరోయిన్లకు కొన్ని హద్దులు ఉండేవి. గత కొన్నాళ్లలో మాత్రం వాటిని చెరిపేశారు. మరింత ముందుకు పోయి ఇంకా ఇంకా చెరిపేస్తున్నారు. రొమాన్స్ లోనూ రెచ్చిపోతున్నారు. కొన్ని వీడియోలు చూస్తుంటే.. వీళ్ల యాక్టర్స్ కాదేమో అనే డౌట్ కూడా వస్తోంది. ఎందుకంటే కెమిస్ట్రీ అలా వర్కౌట్ చేస్తున్నారు. చూస్తున్న మనల్ని అది నిజమనిపించేలా భ్రమ కల్పిస్తున్నారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. ఓరచూపుతో ఫేమస్ అయిన బ్యూటీ.. బెడ్ రూమ్ వీడియోతో మరోసారి రెచ్చిపోయింది. రొమాన్స్ ని పీక్స్ కి తీసుకెళ్లింది. రీజన్ లేకుండానే ఇప్పుడు ఈ వీడియో మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుత సోషల్ మీడియా జనరేషన్ లో ఎప్పుడు ఎవరూ ఎందుకు ఫేమస్ అవుతారో తెలియదు. ఒక్కసారి ఫేమ్ వచ్చిందంటే చాలు.. దాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఓరచూపు చూసిన ఒక్క వీడియోతో ఫేమస్ అయిన మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్. ఆ సినిమా ఆమెకు పెద్దగా పేరు తీసుకురాకపోయినప్పటికీ.. ఆ తర్వాత మాత్రం తెలుగు, హిందీలో సినిమా ఛాన్సులు దక్కించుకుంది. మరోవైపు ఇన్ స్టాలో కూడా హద్దులు చెరిపేసి మరీ రెచ్చిపోయింది. అలాంటి చాలా వీడియోలు, ఫొటోల్ని ఎప్పటికప్పుడు పోస్టూ చేస్తూనే ఉంది.
తెలుగులోనూ ఇష్క్, చెక్ సినిమాల్లో నటించిన ప్రియా వారియర్.. హిట్ అయితే దక్కించుకోలేకపోయింది. దీంతో హిందీ, మలయాళంలో పలు చిత్రాలు చేస్తూ బిజీ అయిపోయింది. ప్రస్తుతం ఈమె చేతిలో.. విష్ణుప్రియ అనే కన్నడ సినిమా, శ్రీదేవి బంగ్లా, యారియాన్ 2, త్రీ మంకీస్, లవ్ హ్యాకర్స్ అనే హిందీ సినిమాలు, కొల్ల, ఒరు నలపతుకరాంటే ఇరపాతున్నకారి అనే మలయాళ సినిమాలతో చేస్తుంది. నటిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫొటోస్, వీడియోస్ పోస్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. అలానే గతంలో రంజాన్ అనే నటుడితో కలిసి బెడ్ రూంలో రెచ్చిపోయింది. వీళ్ల కెమిస్ట్రీ చూస్తే మీరు కూడా ఫిదా అయిపోతారు. ఎందుకంటే బెడ్ పై ఒకరికి ఒకరు అతుక్కుని మరీ డ్యాన్స్ చేశారు. అదే ఇప్పుడు వైరల్ గా మారడం నెటిజన్స్ కామెంట్లతో అల్లాడిస్తున్నారు. ఈ బెడ్ రూం వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.