ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తు పట్టారా?, బుడ్డోడు ఎవరో తెలుసా? అని క్వశ్చన్ చేయడమంటే.. సెలబ్రిటీల చిన్నప్పటి ఫోటోల కోసం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలనుకును ఆడియన్స్‌కి అది పజిల్ మాదిరిగానే ఉంటుంది. ఈ ఫోటోలో చిరునవ్వులు చిందిస్తున్న చిన్నదాన్ని కనిపెట్టడం కాస్త కష్టమే.
ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తు పట్టారా?, బుడ్డోడు ఎవరో తెలుసా? అని క్వశ్చన్ చేయడమంటే.. సెలబ్రిటీల చిన్నప్పటి ఫోటోల కోసం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలనుకును ఆడియన్స్‌కి అది పజిల్ మాదిరిగానే ఉంటుంది. ఈ ఫోటోలో చిరునవ్వులు చిందిస్తున్న చిన్నదాన్ని కనిపెట్టడం కాస్త కష్టమే. ఎందుకంటే పెద్దయ్యాక అందులోనూ హీరోయిన్‌గా మారాక చాలా మారిపోయింది. ఇంతకీ ఈ బుడ్డది ఎవరంటే.. టీనేజ్‌లోకి రాగానే ఓరగా ఒంటికన్నుతో అలా సైగ చేసి యూత్ పోరగాళ్లందరికీ మెంటలెక్కించేసి, ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ప్రియా ప్రకాష్ వారియర్.
‘ఒరు ఆధార్ లవ్’ అనే మలయాళీ మూవీతో నేషన్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రియ. జస్ట్ అలా కన్ను కొట్టి కుర్రకారుకి పిచ్చెక్కించేసింది. తెలుగు, హిందీ భాషల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాకపోతే మొదట్లో వచ్చిన క్రేజ్‌ని క్యారీ చేయలేకపోయింది. దీనికి కారణం సరైన సినిమాలు పడకపోవడం, వచ్చినవి సరిగా ఆడకపోవడం. నితిన్ ‘చెక్’, తేజ సజ్జా ‘ఇష్క్ : నాట్ ఎ లవ్ స్టోరీ’ మూవీస్ అంతగా ఆకట్టుకోలేదు. కట్ చేస్తే.. పవన్ కళ్యాణ్, సాయ ధరమ్ తేజ్‌ల ‘బ్రో’ లో నటించి ఆకట్టుకుంది.
ప్రస్తుతం హిందీ, కన్నడలో సినిమాలు చేస్తుంది. ప్రియాకి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ పిక్స్, అప్‌డేట్స్ షేర్ చేస్తుంటుంది. ఇక ఫోటోషూట్లతో కుర్రాళ్లను కవ్విస్తుంటుంది. ఈ మధ్య నెటిజన్లు, సినీ జనాలు షాక్ అయ్యేలా గ్లామర్ డోస్ పెంచేసింది. బిజీ షెడ్యూల్ నుంచి బ్రేక్ తీసుకుని ఇటీవల వెకేషన్ ఎంజాయ్ చేయడానికి థాయ్‌లాండ్ వెళ్లింది. అక్కడ బీచ్‌లో రచ్చ చేసింది. ఆ పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.