జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై రిపబ్లిక్ మూవీ ప్రీరిలీజ్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీంతో స్పందించిన పోసాని కృష్ణ మురళి సోమవారం రాత్రి పవన్ కళ్యాణ్ పై హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పోసాని పవన్ వ్యక్తిగత విషయాల ఆరోపణలను తెరమీదకు తెవటంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక్కసారిగా కోపంతో రగిలిపోయారు.
దీంతో కృష్ణ పోసాని మురళి కుటుంబంపై అసభ్యకరంగా మెసెజ్ చేయటం, కాల్స్ చేసి దూషించారు. దీంతో వెంటనే స్పందించిన పోసాని హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. నిన్న పెట్టిన ప్రెస్ మీట్ కారణంగా పవన్ ఫ్యాన్స్ రెచ్చిపోయి నా భార్యను, మా ఇంటి ఆడవాళ్లపై అసభ్య పధజాలంతో దూషిస్తున్నారని పోసాని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ .. మా ఇంట్లో ఆడవాళ్ళని తిడితే.., మీ ఇంట్లో ఆడవాళ్ళని కూడా తిడతానంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏదైన వ్యక్తిగతమైన విషయాల్లో నా పొరపాటుంటే నేను క్షమాపణలు చేబుతా కానీ నా భార్యను కానీ మా ఇంట్లోని ఆడవాళ్లను తిడితే ఉరుకోనని మీ ఇంట్లోని ఆడవాళ్లను కూడా తిడతనంటూ పోసాని సంచలనమైన కామెంట్స్ చేశాడు.