వెండితెరపై ఒక్క ఛాన్సు వస్తే చాలు జీవితం ధన్యమైనట్టే అనుకునే వాళ్లు వేల మంది ఉంటారు. అందుకోసం స్టూడియోల చుట్టూ ప్రదక్షణలు చేస్తుంటారు. కానీ ఈ మద్య టిక్ టాక్ తో చాలా మంది తమలోని టాలెంట్ బయటపెడుతూ యూట్యూబ్ స్టార్స్ గా మారారు. అలా యూట్యూబ్ వీడియోలను చేస్తూ.. టాలీవుడ్ స్టార్స్ పై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తూ.. నిత్యం వార్తల్లో నిలిచేవాడు శాక్రిఫైజ్ స్టార్ సునిశిత్.
టాలీవుడ్ స్టార్స్ పై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తూ.. నిత్యం వార్తల్లో నిలిచేవాడు. ముందు ఆ సినిమా ఛాన్స్ నాకే వచ్చింది.. కానీ ఆ స్టార్ హీరో అడిగితే ఆఫర్ ఇచ్చేసా.. ఆ హీరోయిన్‍తో నాకు పెళ్లైంది.. ఎఫైర్ ఉందని,.. తను ఇప్పటివరకు ఇన్ని సినిమాలు చేశానని వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవాడు. ఇండస్ట్రీలో సునిశిత్ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు.. కాకపోతే కొందరు హీరోయిన్స్ రియాక్ట్ అయ్యి.. తమపై అసత్య ప్రచారం చేస్తున్న సునిశిత్ పై కేసు పెట్టారు. ఆ తర్వాత శాక్రిఫ్రైజ్ స్టార్ పత్తా లేకుండా పోయాడు. ఓ పోలీస్ అధికారిపై తప్పుడు ఆరోపణలు చేసి అడ్డంగా బుక్కయ్యాడు సునిశిత్. ఈ క్రమంలోనే శుక్రవారం అతడిని అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే… గతేడాది అతడిపై కేసు నమోదు కావడంతో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బెయిల్‌పై బయటికొచ్చాక సునిషిత్ టీవీ పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించి వివాదస్పద వీడియోలను పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఇటీవల మల్కాజిగిరి స్టేషన్‌లో పనిచేసే ఓ పోలీసు అధికారిపై తప్పుడు వీడియో పోస్ట్ చేశాడు. ఆ ఎస్ఐ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని కీసర పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, సునిషిత్ ఉద్దేశపూర్వకంగానే తప్పుడు వీడియో పోస్ట్ చేసినట్లు తేలడంతో అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు కీసర సీఐ నరేందర్‌గౌడ్ తెలిపారు.