ఈ మద్య సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్, మరణ వార్తలు ఇట్టే వైరల్ అవుతున్నాయి. కొన్ని సార్లు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు మాత్రమే కాదు.. తప్పుడు ఫోటోలు, వీడియోలు కూడా ప్రసారం కావడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి. తీరా తప్పు తెలుసుకొని సరిదిద్దుకునే సమయానికి జరగరాని నష్టం జరిగిపోతుంది. తాజాగా ప్రముఖ నిర్మాత గోరంట్ల రాజేంద్రప్రసాద్ కన్నుమూశారు. ఈయన వయసు 86 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతోన్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఇండస్ట్రీ విషయం కాబట్టి త్వరగా అప్డేట్ చేసే క్రమంలో కొంత మంది గోరంట్ల రాజేంద్రప్రసాద్ ఫోటో బదులు గోరంట్ల బుచ్చయ్య చౌదరికి సంబంధించిన ఫోటోలు వాడేశారు. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.. ఇది గమనించి.. వారంతా వెంటనే తప్పు సరిదిద్దుకునే పనిలో పడ్డారు. అయినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
గోరంట్ల రాజేంద్రప్రసాద్, రామానాయుడుతో కలిసి ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించారు. అంతేకాకుండా మాధవి పిక్చర్స్ బ్యానర్‌లో ఆయన ‘దొరబాబు’, ‘సుపుత్రుడు’, ‘కురుక్షేత్రం’, ‘ఆటగాడు’ వంటి సినిమాలను నిర్మించి మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా పేరుపోందారు. రాజేంద్రప్రసాద్ మరణంతో టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఇది కూడా చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత!
ఇక గోరంట్ల చౌదరి అంటే పొలిటికల్ సర్కిళ్లలో తెలియని వారు ఉండరు. ఆయన టీడీపీ స్థాపించిన నాటి నుండి ఆ పార్టీలోనే కొనసాగుతు వస్తున్నారు. ఇప్పటికే చాలా సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత ఆయనది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున గెలిచిన 23 మంది వ్యక్తుల్లో బుచ్చయ్య చౌదరి ఒకరు కావడం విశేషం. ఇలాంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గురించి కనీస వివరాలు తెలుసుకోకుండా.. మరణ వార్తకు ఆయన ఫోటో షేర్ చేయడం ఏంటి అని నెటిజన్స్ మండి పడుతున్నారు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Venu Thottempudi: రవితేజ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న వేణు.. ‘ఆ కారణంగానే సినిమాలకు దూరం అయ్యాను’!