'RX 100' బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నెటిజన్లకు షాకిచ్చింది. టాప్ లేకుండా పోజులిచ్చి రచ్చ లేపింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఏంటి సంగతి?
హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.. ఈ పేరు చెప్పగానే అరే ఎక్కడో విన్నట్లుంది అని చాలామంది అనుకుంటారు. అవును మీరు గెస్ చేసింది కరెక్ట్. ‘RX 100’తో తెలుగులో హీరోయిన్ గా పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత పలు సినిమాలు చేసిప్పటికీ.. ఒక్కటంటే ఒక్కటి కూడా సరైన హిట్ కొట్టలేకపోయింది. ఆల్మోస్ట్ కనుమరుగైపోయిందనే చెప్పాలి. అలాంటిది ఇప్పుడు తాను ఓ కొత్త మూవీలో నటిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. టాప్ లేకుండా ఓ బోల్డ్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసింది. దీంతో ఇది కాస్త ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. ఇంతకీ ఏంటి విషయం?
అసలు విషయానికొస్తే.. టాలీవుడ్ లోకి ఎప్పటికప్పుడు కొత్త డైరెక్టర్స్ వస్తూనే ఉన్నారు. సరికొత్త స్టోరీలతో సినిమాలు తీస్తూ హిట్స్ కొడుతూనే ఉన్నారు. అలా 2018లో వచ్చిన ‘ఆర్ఎక్స్ 100’ ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా ఈ చిత్రంలోని హీరోయిన్ గా చేసిన పాయల్ రాజ్ పుత్ యాక్టింగ్ కి అందరూ ఫిదా అయిపోయారు. డైరెక్టర్ అజయ్ భూపతిని అందరూ తెగ మెచ్చుకున్నారు. కట్ చేస్తే.. ఈ మూవీ తర్వాత అటు డైరెక్టర్, ఇటు హీరోయిన్ కి మరో హిట్ లేకుండా పోయింది.
దీంతో ఇప్పుడు మళ్లీ వాళ్లిద్దరూ హిట్ కొట్టేందుకు ఒక్కటైనట్లు తెలుస్తోంది. తనకు అచొచ్చిన పాయల్ రాజ్ పుత్ నే డైరెక్టర్ అజయ్ భూపతి నమ్ముకున్నాడు. ‘మంగళవారం’ అనే టైటిల్ తో తీస్తున్న సినిమాలో పాయల్ రాజ్ పుత్ ని హీరోయిన్ గా తీసుకున్నాడు. ఆమె శైలజ అనే క్యారెక్టర్ చేస్తోంది. తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా.. అందులో టాప్ ఏం వేసుకోకుండా పాయల్ కనిపించింది. ఇది సమ్ థింగ్ ఇంట్రెస్ట్ అనేలా ఉంది. ఇదిలా ఉండగా తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తీస్తున్న ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ పాయల్ బోల్డ్ లుక్ చూసి మీకేం అనిపించింది. కింద కామెంట్ చేయండి.
The LOOK says a lot if you can see 🔥🦋
Presenting Feisty and Beautiful @starlingpayal as ‘Shailaja’ from #Mangalavaaram #Chevvaikizhamai #Chovvazhcha @DirAjayBhupathi @AJANEESHB @MudhraMediaWrks @ACreativeWorks_ #SwathiGunupati #SureshVarmaM pic.twitter.com/wPDs3rC5AO
— paayal rajput (@starlingpayal) April 25, 2023