పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి సినిమా వస్తుంది అంటే చాలు అభిమానుల్లో పూనకాలు లోడింగ్ అవుతుంటాయి. ఎప్పుడెప్పుడు పవన్ సినిమాను థియేటర్లలో చూద్దామా అని ఎదురుచూస్తుంటారు అభిమానులు. ఈ క్రమంలోనే అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఓ వైపు రాజకీయాలతో మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే పలు వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న పవన్ తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ ను తెరపైకి ఎక్కించాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు టాలీవుడ్ విలన్ కమ్ నటుడు దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఇక ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ అభిమానులతో పంచుకున్నారు మేకర్స్. ఇక ఈ సినిమాలో పవన్ కు తోడుగా మరో హీరో కూడా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తాజాగా ప్రారంభం అయ్యింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి సినిమా వస్తుంది అంటే చాలు అభిమానుల్లో పూనకాలు లోడింగ్ అవుతుంటాయి. ఎప్పుడెప్పుడు పవన్ సినిమాను థియేటర్లలో చూద్దామా అని ఎదురుచూస్తుంటారు అభిమానులు. ఈ క్రమంలోనే అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చింది. పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. తమిళంలో హిట్ అయిన ‘వినోదయ సీతమ్’ కి ఈ సినిమా రీమేక్. ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు ప్రముఖ నటుడు సముద్రఖని. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించినట్లు నిర్మాణ సంస్థలు తెలిపాయి. అందుకు సంబంధించిన ఫోటోలను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
ఈ క్రమంలోనే తొలి రోజు మామా అల్లుళ్లు ఇద్దరు కూడా బ్లాక్ కలర్ హుడిస్ లో మెరిసిపోయారు. ఇక ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహిస్తుండగా.. మాటలు, స్క్రీన్ ప్లేను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందిస్తున్నారు. అదీకాక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మరోసారి దేవుడి పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం పవర్ స్టార్ 20 రోజులు కేటాయించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. పవన్ ఈ చిత్రాలతో పాటుగా ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, OG చిత్రాలు చేస్తూ.. బిజీగా ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ లు కలిసి నటిస్తున్న చిత్రంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.