స్టార్ హీరోయిన్ స్టేటస్ లేకపోయినా కానీ వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు నిత్యామీనన్. బొద్దుగా ఉన్నప్పటికీ నటిగా ఆమెకున్న టాలెంట్‌కి ఎక్కువ అవకాశాలు వరిస్తున్నాయి. హీరోయిన్ అంటే స్లిమ్‌గా ఉండాలి, లేకపోతే అవకాశాలు రావు అనే వారికి.. ఆమె తనదైన శైలిలో అప్పట్లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాను ఇలానే ఉంటాను. మనం ఎలా ఉన్నామన్నది ముఖ్యం కాదు, మనలో కంటెంట్ ఎలా ఉందన్నదే ముఖ్యం అని ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన ఓకే కణ్మణి సినిమా సక్సెస్ తర్వాత నిత్యామీనన్ మణిరత్నంతో మరో సినిమా అవకాశం వస్తే ఆమె తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. మలయాళ సినిమా షూటింగ్ సమయంలో ఆమెను కలిసేందుకు ఒక ప్రొడ్యూసర్ వస్తే ఆమె కలవలేదని అప్పట్లో పెద్ద దుమారం రేపింది. దీంతో నిత్యామీనన్ ఒక పొగరుబోతు అనే ముద్ర వేసేశారు.
ఇటీవల నిత్యామీనన్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఒక వ్యక్తి రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. అయితే నిత్యామీనన్ ఈ విషయాన్ని ఖండించారు కూడా. ఒక సందర్భంలో మలయాళ చిత్ర పరిశ్రమ నిత్యామీనన్‌పై రెడ్ కార్డు విధించాలని అనుకున్నట్టు ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. ఇలాంటి వివాదాస్పద ఘటనలు నిత్యామీనన్ జీవితంలో చాలా చోటు చేసుకున్నాయి. ఎక్స్పోజింగ్, వల్గారిటీ అనే పదాలకు తన నటనలో భాగం చేయకుండా దశాబ్ధానికి పైగా ఆమె ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతున్నారంటే ఆమె టాలెంట్ ఏపాటిదో అర్ధమవుతుంది. అయితే ఇంత టాలెంట్ ఉన్న నటికి ఇండస్ట్రీలో శత్రువులు ఉన్నారంటే నమ్మగలమా? కానీ తనకు శత్రువులు చాలా మందే ఉన్నారని స్వయంగా ఆమెనే అన్నారు.
గిట్టని వాళ్ళు తన మీద రూమర్లు స్ప్రెడ్ చేశారని, తెలుగు పరిశ్రమలో కూడా నిత్యామీనన్‌ని బ్యాడ్ చేయాలని చూశారని అన్నారు. గాసిప్‌లు క్రియేట్ చేయడం, ప్రచారం చేయడం, ఎదుగుతుంటే ఒకర్ని కిందకి లాక్కుని తీసుకురావడం జనానికి చాలా ఇష్టమనుకుంట అని ఆమె అన్నారు. వాళ్ళ మాట వినకపోతే రూమర్లు స్ప్రెడ్ చేస్తారని అంటారు. తనతో పని చేయడం కష్టమని తప్పుడు రూమర్లు ప్రచారం చేస్తున్నారని, అయితే తాను చాలా మందితో కలిసి పని చేశానని, ఎవరూ అలా ఫీలవ్వలేదని అన్నారు. ఎందుకంటే తన వ్యక్తిత్వం ఎలాంటిదో అందరికీ తెలుసని ఆమె అన్నారు.
ఇక నిత్యామీనన్ నటించిన తాజా చిత్రం తిరు. ‘తిరు చిత్రాంబళం’ అనే తమిళ చిత్రానికి అనువాదంగా వచ్చిన ఈ సినిమా హిట్ టాక్‌తో దూసుకెళ్తుంది. ధనుష్ హీరోగా వచ్చిన ఈ సినిమా తమిళంలోనూ కమర్షియల్ సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం ఈమె మలయాళంలో రెండు ప్రాజెక్టులు చేస్తున్నారు. తిరు సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ఆమె ఒక ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. మరి నిత్యామీనన్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.