పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయాక్. మాళయాలంలో సూపర్ హిట్‌గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియం అనే చిత్రాన్ని తెలుగు రీమేక్ చేస్తున్నారు. ఈ మూవీకి సాగర్ చంద్ర దర్శకత్వం వహస్తున్నారు. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నాడు. అయితే ఇటీవల విడుదల చేసిన భీమ్లా నాయాక్ ఫస్ట్ గ్లిమ్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో సారి బ్రేక్ టైమ్ ఫర్ భీమ్లా నాయక్ అంటూ మరో విడియోను విడుదల చేశారు ఇందులో యోగి కమండలం కమ్ము నుంచి చెట్లకు ప్రాణధారలు వదులుతాడు, యోధుడు తుపాకీ గొట్టం అంచు నుంచి ప్రకృతికి వత్తాసు పలుకుతాడు, ఇక నాయకుడు ఈ రెండింటిని తన భుజాన మెసుకుంటూ మందుకు కదులుతాడు అనే తూటాల్లాంటి అక్షరాలతో వీడియో సాగుతోంది. ఇందులో తుపాకీ చేత పట్టి అడవుల్లో కాల్పలు జరపుతున్న పవన్ విజువల్స్ కేక పుట్టిస్తున్నాయి. మీరు ఓ సారి లుక్కేయండి.