ఆమెని చూస్తే చాలా సింపుల్ గా ఉంటుంది. మన పక్కింటి అమ్మాయిలా కనిపిస్తుంది. మీడియా ముందుకు అస్సలు రాదు. కానీ యాక్టింగ్ తో మాత్రం కేక పుట్టిస్తుంది. యంగ్ హీరో, సీనియర్ హీరో అనే తేడా లేకుండా అందరితో సినిమాలు చేస్తుంది.హిట్స్, సూపర్ హిట్స్ కొడుతుంది. అనుకోకుండా యాక్టర్ అయిన ఈమె.. ప్రస్తుతం సౌతిండియాలో లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. ఈ ఏడాదే పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు కవల పిల్లలకు తల్లి కూడా అయింది. ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్ లోనూ నిలిచింది. మరి ఆమె ఎవరో గుర్తుపట్టారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార. ఆమె పుట్టినరోజు ఈరోజు(నవంబరు 18). 1984లో కేరళలోని తిరువల్లాలో పుట్టిన నయన్.. గుజరాత్ లో పెరిగింది. సీఏ కావాలనుకుంది. కానీ నయన్ పెదనాన్న యాడ్ ఏజెన్సీ నిర్వహించేవారు. నయన్ ఫొటోలు కూడా పలు యాడ్ ఏజెన్సీలకు పంపించారు. అలా మలయాళంలో ఆమెకి ఫస్ట్ ఛాన్స్ వచ్చింది. ఆ మూవీనే ‘మనసినక్కరే’. 2003 లో ఈ సినిమా రిలీజైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 75 సినిమాల్లో నటించింది.
‘లక్ష్మీ’ సినిమాతో తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నయనతార.. ఆ తర్వాత దుబాయ్ శీను, తులసి, అదుర్స్, సింహా, శ్రీరామరాజ్యం, సైరా, గాడ్ ఫాదర్ లాంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. కన్నడ, తమిళ, మలయాళంలోనూ ఇప్పటికీ హీరోయిన్ గా చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుత జనరేషన్ హీరోయిన్లలో నయన్ చేసిన సినిమాలు మరో భామ చేయలేదు! చేయలేకపోవచ్చు కూడా! ఇక 2010లో దక్షిణాదిలోని నాలుగు భాషల్లో హిట్ కొట్టిన నయన్.. ప్రభుదేవాతో ప్రేమ కారణంగా కొన్నాళ్లు సినిమాలకు దూరమైంది. అతడితో విడిపోవడంతో హీరోయిన్ గా రీఎంట్రీ ఇచ్చింది. ఇక ‘నేనే రౌడీనే’ చేస్తున్న టైంలో దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో పరిచయమైంది. ఏడేళ్ల రిలేషన్ షిప్ లో ఉన్న వీళ్లు.. రీసెంట్ గా పెళ్లి చేసుకున్నారు. సరోగసి ద్వారా ట్విన్స్ ని కూడా కన్నారు. మరి నయన్ చిన్నప్పటి ఫొటోని మీలో ఎంతమంది గుర్తుపట్టారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.