మీకు చాలామంది ఫ్రెండ్స్ ఉండే ఉంటారు. కానీ ఇతడిలా మాత్రం సర్ ప్రైజ్ చేసి ఉండరు. ఎందుకంటే ఈ స్టార్ సింగర్.. తన ఫ్రెండ్ కు ఏకంగా రూ.50 లక్షలు కారుని గిఫ్ట్ గా ఇచ్చాడు.
సాధారణంగా సెలబ్రిటీలు కొందరు ఏం చేసినా సరే గ్రాండ్ గా చేస్తారు. సినిమాలో చేయడం దగ్గర నుంచి పర్సనల్ విషయాల వరకు ప్రతిదీ కొంతలో కొంతైనా రిచ్ గా ఉండేలా చూసుకుంటారు. ఒకప్పుడు అంటే పెద్దగా తెలిసేది కాదు గానీ ఇప్పుడు ఏ సెలబ్రిటీ ఏది కొన్నా సరే సోషల్ మీడియా వల్ల ఇట్టే తెలిసిపోతోంది. తాజాగా ప్రముఖ సింగర్ కూడా అలానే దాదాపు రూ.50 లక్షల విలువైన బెంజ్ కారు కొన్నాడు. దాన్ని తన ఫ్రెండ్ కు గిఫ్ట్ గా ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఆ ఫొటోతో పాటు విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సినిమాలకు భాషతో సంబంధం లేనట్లే.. సింగింగ్ కు కూడా భాషతో అస్సలు సంబంధం లేదు. తెలుగు వాళ్ల కాకపోయినప్పటికీ.. సౌత్-నార్త్ కు చెందిన చాలామంది పాపులర్ గాయకులు.. టాలీవుడ్ లో పాటలు పాడుతున్నారు. హిట్స్ కొడుతున్నారు. ఇప్పుడు బాలీవుడ్ సింగర్ మికా సింగ్ గురించి చెప్పుకొందాం. పాప్, మూవీ సాంగ్స్ తో బాగా ఫేమస్ అయిన ఇతడు.. పంజాబీ సింగర్ దలేర్ మెహంది తమ్ముడు. తెలుగులోనూ ‘మిర్చి’ సినిమాలో పాట పాడి అదరగొట్టాడు. తాజాగా తనకు దాదాపు 30 ఏళ్ల నుంచి ఫ్రెండ్ గా ఉన్న కన్వల్ జీత్ సింగ్ కు మెర్సిడెజ్ బెంజ్ కారును బహుమతిగా ఇచ్చాడు. ఈ విషయాన్ని మికా సింగ్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుని, మాటల్లో చెప్పలేని హ్యాపీనెస్ ని వ్యక్తం చేశాడు.
‘మేం ఎప్పుడూ ఏదో ఒకటి కొంటూ ఉంటాం. కానీ మీకోసం కష్టపడే, పనిచేసే వ్యక్తుల కోసం ఆలోచించం. నా ఫ్రెండ్ ఈ హ్యాపీనెస్ కు అర్హుడు’ అని మికా సింగ్ పోస్ట్ చేశాడు. ఇది చూసిన పలువురు నెటిజన్స్.. మికా సింగ్ ని ప్రశంసిస్తున్నారు. మరోవైపు కారు అందుకున్న కన్వల్ జీత్ సింగ్.. ‘మేం కలిసి 30 ఏళ్లయింది. అతడు కేవలం నా ఫ్రెండ్ మాత్రమే కాదు. అంతకు మించి మేం జీవితాంతం బ్రదర్స్. నా ఫేవరెట్ కారుని గిఫ్ట్ గా ఇచ్చినందుకు థ్యాంక్స్. ఇది చాలా సూపర్ గా ఉంది.’ అని రాసుకొచ్చాడు. అయితే మికా కోసం కన్వల్ జీత్ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన కృతజ్ఞతను మికా సింగ్ ఇలా చూపించినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ బెంజ్ కారు విలువ మార్కెట్ లో దాదాపు రూ45-50 లక్షల మధ్య ఉంది. మరి ఫ్రెండ్ కు రూ.50 లక్షల కారుని సింగర్ గిఫ్ట్ ఇవ్వడంపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.