Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల క్రేజీ కాంబో ‘‘ ఆచార్య’’. ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం మెగా ఫ్యామిలీ అభిమానులతో పాటు సినీ అభిమానులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో రామ్ చరణ్ నటించిన మగధీర, బ్రూస్లీ సినిమాల్లో చిరంజీవి గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. అయితే, మొట్టమొదటి సారి మెగాస్టార్ సినిమాలో రామ్ చరణ్ ఎక్కువ నిడివి ఉన్న పాత్ర చేశారు. తండ్రీ, కొడుకులు కలిసి నటిస్తున్న సినిమా కావటంతో అంచనాలు తారా స్థాయికి చేరాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లతో చిరంజీవి బిజీ, బిజీగా గడుపుతున్నారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో కోస్టార్, కొడుకు రామ్ చరణ్‌కు సంబంధించి చిరంజీవి పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. కుమారుడి నటనను ఆకాశానికి ఎత్తేశారు.
ఆ ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘ చిన్నప్పుడు నిక్కర్లు వేసుకునే ఏజ్‌లో ప్యాంట్స్ వేసుకునే వాడు. అందరూ బొమ్మల చొక్కాలు వేసుకుంటే..కార్పోరేట్ స్టైల్లో బట్టలు వేసుకునేవాడు. తన మైండ్‌సెట్ తన ఏజ్ కంటే ఎక్కువగా ఉంటుంది. మాట్లాడటం కంటే.. మాట్లాడేవారి దగ్గరినుంచి నేర్చుకోవటం ఎక్కువ ఉంటుంది. ఇక, నటన పరంగా వందశాతం డెలివరీ చేయాలి. డైరెక్టర్స్ యాక్టర్ అనిపించుకోవాలనే తాపత్రయం ఉంటుంది. క్యారెక్టర్ పరంగా విని ఆబ్జార్వ్ చేసుకుని, ప్రతీ రోజు షూటింగ్‌కు ఓ తెల్లకాగితంలా వెళతాడని మొన్న రాజమౌళి అన్న మాట వందశాతం కరెక్ట్. అదే విషయం కొరటాల శివ కూడా చాలా సార్లు చెప్పారు’’ అని అన్నారు. తన కుమారుడు ఓ సత్తా ఉన్న నటుడంటూ పొగడ్తలతో ముంచెత్తారు. మరి, అతి త్వరలో విడుదల కాబోతున్న ‘‘ ఆచార్య’’ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : స్టార్ హీరోకి అవమానం.. తోసిపడేసిన పోలీసులు!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.