‘చమ్మక్ చంద్ర’ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. జబర్దస్త్ షోతో అందరి మనసులు దోచుకున్న చమ్మక్ చంద్ర.. ఇప్పుడు ఆ షోలో లేడనే విషయం అందరికీ తెలుసు. జబర్దస్త్ కంటే ముందు కొన్ని సినిమాలు చేసినా కూడా అతనికి ఆ షోతోనే గుర్తింపు వచ్చింది. కానీ, మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ షోను వదిలి వెళ్లిన సమయంలోనే చమ్మక్ చంద్ర కూడా ఆ షోకు గుడ్ బై చెప్పాడు. ఆ తర్వాత అదిరింది, బొమ్మ అదిరింది, కామెడీ స్టార్స్ అంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఆ తర్వాత వాటిలోనూ పెద్దగా కనిపించలేదు. సినిమాలు చేస్తున్నాడేమో అనుకున్నారు.
నూతన సంవత్సరం సందర్భంగా జీతెలుగులో ప్రసారం కాబోతున్న ప్రత్యేక కార్యక్రమంలో చమ్మక్ చంద్ర కనిపించబోతున్నాడు. ఆ స్టేజ్ పైనే నాగబాబు.. చంద్ర ఎంత గొప్పవాడో లైవ్ లో అందరికీ చూపించాడు. ‘ఈరోజుల్లో చాలామంది వారు స్థిరపడిపోగానే తల్లిదండ్రులను పట్టించుకోవడం మానేస్తారు. కానీ, చంద్రా అలా కాకుండా తాను కూడబెట్టిన డబ్బుతో తల్లిదండ్రుల కోసం విలాసవంతమైన ఇల్లు కట్టించాడు. వారి సంతోషంలోనే అతని సంతోషాన్ని చూసుకున్నాడు’ అంటూ చెప్పుకొచ్చాడు. స్టేజ్ పైనే చంద్రా తన తల్లిదండ్రులకు ఆ ఇంటి తాళాలు అప్పగించాడు. ఈ ప్రోమో చూశాక సోషల్ మీడియాలో చంద్రాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. చమ్మక్ చంద్ర చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.