Meena: ప్రముఖ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్యం కారణంగా గత నెలలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. కరోనా సోకిన తర్వాత ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతూ.. చెన్నైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. భర్త మరణంతో మీనా తల్లడిల్లిపోయారు. స్వయంగా అన్నీ తానై భర్త అంత్యక్రియలు నిర్వహించారు. విద్యాసాగర్ మరణంతో కూతురు నైనిక పూర్తి బాధ్యత మీనాపై పడింది.
అయితే, కూతురి విషయంలో విద్యాసాగర్ ఎంతో ముందు చూపుతో ఆలోచించినట్లు సమాచారం. తాను చనిపోయిన తర్వాత కూతురికి ఎలాంటి కష్టం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారంట. ఆర్థిక కష్టాలన్నవి పాప దరిచేరకుండా.. లైఫ్ సెటిల్‌గా ఉండేలా భారీగా ఆస్తిని కూతురికి అందించినట్లు తెలుస్తోంది. కాగా, మీన, విద్యాసాగర్‌తో పెళ్లి గురించి మాట్లాడుతూ.. ‘‘ నాకు ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.
అప్పుడు విద్యాసాగర్ సంబంధం వచ్చింది. ఇద్దరి జాతకాలు కలవటంతో ఇంట్లో వాళ్లు ఒకే అన్నారు. ఓ సారి నేను అతడ్ని కలిసి మాట్లాడాను. కానీ, నాకు అతడు నచ్చలేదు. ఎందుకంటే.. ఇద్దరి వృత్తులూ వేరు.. ఆలోచనలు వేరూ.. ఇదే విషయాన్ని విద్యాసాగర్‌కు చెప్పాను. అతను నన్ను అర్థం చేసుకున్నాడు. ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఆ తర్వాత మా ఆంటీ నాతో గట్టిగా ఓ మాట చెప్పింది.
నేను ఓ మంచి మనిషిని దూరం చేసుకుంటున్నానని హెచ్చరించింది. ఆమె అంత గట్టిగా చెప్పిన తర్వాత దాని గురించి ఆలోచించా. ఆ తర్వాత విద్యాసాగర్‌తో పెళ్లికి ఒకే చెప్పా. అప్పటినుంచి ఇప్పటివరకు నేను నా భర్త విషయంలో ఎప్పుడూ బాధపడలేదు’’ అని చెప్పకొచ్చారు. మరి, కూతురు నైనిక విషయంలో విద్యాసాగర్ ముందు చూపుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Kalyan Dev: నీ ప్రేమ వల్ల వాటిని ఎదుర్కొంటున్నా.. కల్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్ట్!