రామాయణం విన్నా.. చూసినా జన్మధన్యం అవుతుందని అంటారు.. రామాయణం ఇతిహాసంగా సినిమాలు, సీరియల్స్ వచ్చాయి. ఎన్నిసార్లు రామాయణం తెరపై చూసినా తనివి తీరదు అంటారు.
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ప్రభాస్ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్’ మూవీ గురించిన ప్రస్తావనే కొనసాగుతుంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌనత్ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన మూవీ ‘ఆదిపురుష్’. ఈ చిత్రం జూన్ 16 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్మురేపిన విషయం తెలిసిందే. తిరుపతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈ మూవీ పురాణేతిహాసం రామాయణం నేపథ్యంలో సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు సైతం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. రాముడి గురించి ప్రతి ఒక్కరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో సినీ సెలబ్రెటీలు పేదలు, అనాథ పిల్లలకు ఉచితంగా సినిమా చూపించనున్నట్లు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మంచు మనోజ్ ‘ఆదిపురుష్’ మూవీ విషయంలో గొప్ప మనసు చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే..
ఓం రౌనత్ దర్శకత్వంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్న తెరెక్కిస్తున్న మైథలాజికల్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ మూవీ ‘ఆదిపురుష్’. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జూన్ 16 న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను నిరుపేదలు, అనాథలు సైతం చూడాలన్న ఉద్దేశ్యంతో పలువురు సినీ ప్రముఖులు మూవీ టికెట్స్ భారీ ఎత్తున ముందుగానే కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ 10 వేలకిపైగా టికెట్లను కొనుగోలు చేశారు. వృద్ధాశ్రమాలకు, అనాథ శరణాలయాలు అందివ్వనున్నట్టు ప్రకటించారు. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ 10 వేల టికెట్లు, ప్రముఖ సింగర్ అనన్య బిర్లా 10 వేల టికెట్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక శ్రేయాస్ మీడియా అధినేత శ్రీనివాస్ ఖమ్మం జిల్లాలో ప్రతి గ్రామంలో ఉండే రామాలయానికి 101 టికెట్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇదే బాటలో ఇప్పుడు మంచు మనోజు నడుస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోని అనాథ శరణాలయాల్లోని ఉన్న 2500 మంది చిన్నారులకు ‘ఆదిపురుష్’మూవీని ఉచితంగా చూపించేందుకు మనోజ్ దంపతులు ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేధికగా అందరితో పంచుకున్నాడు మంచు మనోజ్. జీవితంలో వచ్చే అరుదైన అవకాశం. బృహస్పతి టెక్, నమస్తే వరల్డ్‌తో కలిసి ఇంత గొప్ప కార్యక్రమం చేపడుతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. మంచు మనోజ్-మౌనిక దంపతుల గొప్ప మనసు పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Jai Shri Ram 🙏🙏🙏#Adipurush ❤️🔥@BhumaMounika@Brihaspathitec @namastheworld#Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh @TSeries @Retrophiles1 @UV_Creations @Offladipurush #Pramod #Vamsi @AAFilmsIndia @peoplemediafcy pic.twitter.com/WM1yolK0C2
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) June 12, 2023