మంచు లక్ష్మీకి టాలీవుడ్ లో సెపరేట్ క్రేజ్ ఉంది. ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్స్ చాలామందితో ఈమె.. మంచి రిలేషన్స్ మెంటైన్ చేస్తూ ఉంటుంది. తాజాగా హీరో సుమంత్ తో తీసుకున్న ఫొటో పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది.
మంచు లక్ష్మీ.. ఈ పేరు గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నట వారసురాలిగా ఇప్పటికే ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టిన మంచు లక్ష్మీ.. ఆ తర్వాత నిర్మాతగా, మధ్యలో కొన్ని టీవీ షోలకి వ్యాఖ్యాతగా కూడా చేసి అందరిని అలరించింది. ఈ మధ్య లెస్బియన్ గానూ యాక్ట్ చేసి అందరూ షాకయ్యేలా చేసింది. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే ఈమె.. అప్పుడప్పుడు ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతూ ఉంటుంది. తాజాగా అక్కినేని హీరో సుమంత్ తీసుకున్న ఓ పిక్ ని పోస్ట్ చేయగా అదికాస్త వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన సుమంత్, హీరోగా బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. గౌరీ, సత్య, గోదావరి లాంటి సినిమాలతో హిట్స్ కూడా కొట్టాడు. గత కొన్నాళ్ల నుంచి మాత్రం హీరోగా కంటే సహాయపాత్రలు చేస్తూ ఫేమ్ తెచ్చుకుంటున్నాడు. ‘మహానటి’ సినిమాలో నాగేశ్వరరావు పాత్రలో కనిపించి అందర్నీ మెప్పించాడు. ఇక తాజాగా సుమంత్ బర్త్ డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భం గా సుమంత్ కి ఫ్యాన్స్, సెలబ్రిటీలు చాలామంది విషెస్ చెప్పారు. ఈ క్రమంలోనే తన ఫ్రెండ్ అయిన మంచు లక్ష్మీ కూడా.. “హేవ్.. ఏ గ్రేట్ ఇయర్ ఎహెడ్” అని ఓ ఫొటోతో ట్వీట్ చేసింది. ఈ ఫొటోలో సుమంత్-లక్ష్మీ ఇంట్రెస్టింగ్ పోజులో కనిపించారు. దీంతో ఇది కాస్త వైరల్ గా మారింది.
ఇకపోతే సుమంత్ రీసెంట్ గా ‘సీతారామం’ సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ లో నటించి అదరగొట్టేశాడు. ప్రస్తుతం ‘అనగనగా ఒక రౌడీ’ అనే మాస్ సినిమా చేస్తున్నాడు. మరోవైపు మంచు లక్ష్మీ.. తండ్రి మోహన్ బాబుతో కలిసి ‘అగ్నినక్షత్రం’ సినిమా చేస్తోంది. అది ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. సరే ఇదంతా పక్కనబెడితే.. సుమంత్ కు బర్త్ డే విషెస్ చెబుతూ మంచు లక్ష్మీ పోస్ట్ చేసిన ఫొటో మాత్రం తెగ వైరల్ అయిపోయింది. మరి దీనిపై మీరేం అంటారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.
Wishing the darling @iSumanth a great year ahead!
Happy Birthday ♥️ #HBDSumanth #HappyBirthdaySumanth pic.twitter.com/fYNQFu3pT6— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) February 9, 2023