ఓ పాపులర్ నటి తన స్నేహితుడితో కలిసి ఓ వృద్ధుడికి వలపు వల విసిరి కటకటాల పాలైంది. కేరళలోని పాతనమిట్ట ప్రాంతానికి చెందిన నిత్యా శశి మలయాళంలో టీవీ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె న్యాయవాది కూడా.
ఓ పాపులర్ నటి తన స్నేహితుడితో కలిసి ఓ వృద్ధుడికి వలపు వల విసిరి కటకటాల పాలైంది. కేరళలోని పాతనమిట్ట ప్రాంతానికి చెందిన నిత్యా శశి మలయాళంలో టీవీ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె న్యాయవాది కూడా. అలాంటి నిత్యా తన ఫ్రెండ్ బినుతో కలిసి అడ్డదారులు తొక్కింది. అద్దెకు ఇల్లు వెతుకుతున్న క్రమంలో తిరువనంతపురంలో ఉండే 75 ఏళ్ల వృద్ధుడు (ఆర్మీ రిటైర్ ఉద్యోగి) ని సంప్రదించింది. అక్కడ ఏర్పడిన పరిచయంతో నిరంతర ఫోన్ కాల్స్ ద్వారా అతడితో స్నేహం పెంచుకుంది. దీంతో ఒకరోజు కలకోటేలో తనుంటున్న అద్దె ఇంటికి రావాలంటూ ఆహ్వానించింది. పిలిచింది కదా అని ఆయన వెళ్లాడు. కట్ చేస్తే అక్కడే సాలిడ్ ట్విస్ట్ ఎదురైంది.
దీని గురించి ఆయన పోలీసులకు ఇలా వివరించాడు. ‘నేను నిత్య ఇంట్లోకి వెళ్లగానే నన్ను మాటల్లో పెట్టి నా దుస్తులు తొలగించింది. ఆపై తన డ్రెస్ కూడా తీసేసింది. ఇంతలో సడెన్‌గా ఆమె స్నేహితుడు బిను వచ్చి నా ఫోటోలతో పాటు మేమిద్దరం కలిసి ఉన్న కొన్ని పిక్స్ తీశాడు. అడిగినంత డబ్బు ఇవ్వాలని, లేదంటే ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బెదిరించారు. ఇప్పటి వరకు రూ.11 లక్షలు ఇచ్చాను. కానీ వారు రూ.25 లక్షలు అడుగుతున్నారు. అంత డబ్బు తన వద్ద లేదని, ఇక ఇవ్వలేనని వేడుకున్నా.. బెదిరింపులు ఆగట్లేదు’ అంటూ వాపోయాడు.
పోలీస్ బ్రెయిన్ వాడి, పక్కా ప్లాన్‌తో..
పోలీసుల సూచన మేరకు.. మీరు అడిగిన రూ.25 లక్షలు ఇస్తాను, రమ్మని నిత్యా, బినులను తన ఇంటికి పిలిచాడు. డబ్బు వస్తుందనే ఆనందంతో వారిద్దరూ వృద్ధుడి ఇంటికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ మాటు వేసిన పోలీసులు నిత్యా, బినులను అదుపులోకి తీసుకున్నారు. ఆపై కోర్టులో హాజరు పరిచారు. ఈ సంఘటన మలయాళ టీవీ, సినీ పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చలకు దారి తీసింది.