తారకరత్న మరణాన్నే ఇంకా మర్చిపోలేకపోతున్నాం. ఇప్పుడు మరో నటి చాలా చిన్న వయసులోనే తుదిశ్వాస విడిచింది. ప్రస్తుతం ఇది కాస్త ఇండస్ట్రీలో విషాదాన్ని నింపేసింది.
ఇండస్ట్రీలో వరస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ మధ్య తారకరత్న చనిపోవడంతో టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ఇది జరిగిన తర్వాతి రోజే తమిళ స్టార్ కమెడియన్ మయిల్ సామి చనిపోయారు. ఇలా వరసగా నటులు మరణించడంతో సెలబ్రిటీల దగ్గర నుంచి నెటిజన్స్ వరకు ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. వాళ్లకు సంతాపం తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇవి మరవక ముందే మరో ప్రముఖ నటి చాలా చిన్న వయసులోనే తుదిశ్వాస విడిచింది. దీంతో స్టార్ హీరోల దగ్గర నుంచి మిగతా సెలబ్రిటీల వరకు ఆమెపై పోస్టులు పెడుతున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. యాంకర్, నటిగా గుర్తింపు తెచ్చుకున్న సుబి సురేష్ కు మలయాళంలో విపరీతమైన క్రేజ్ ఉంది. తనదైన యాంకరింగ్ తో అందరినీ ఎంటర్ టైన్ చేసే ఈమె.. డ్యాన్సర్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత పలు షోలకు హోస్ట్ గా వ్యవహరించింది. మేడ్ ఫర్ ఈచ్ అదర్, కుట్టీ పట్టలాం లాంటి షోలు చేసి మలయాళీ ఆడియెన్స్ ని ఫుల్ గా అలరిస్తూ వచ్చింది. ‘సినిమాల’ కామెడీ షోతో బాగా పేరు తెచ్చుకున్న సుబి సురేష్.. దాదాపు ప్రతి ఇంట్లోనూ ఓ మనిషి అయిపోయింది.
ఇలా షోలతో ఫేమ్ తెచ్చకున్న సుబి సురేష్.. గృహనాథన్, తస్కర లహల, ఎల్సమ్మా ఎన్న ఆన్ కుట్టీ సినిమాల్లోనూ యాక్ట్ చేసింది. అలాంటి ఈమె గత కొన్నాళ్ల నుంచి లివర్ సమస్యలతో బాధపడింది. దీంతో ఆమెని ఆస్పత్రిలో చేర్చారు. తాజాగా పరిస్థితి చేయిదాటడంతో బుధవారం ఉదయం సుబి సురేష్ తుదిశ్వాస విడిచింది. ఈ క్రమంలోనే మలయాళ ప్రము హీరోల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆమె మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. ఇలా వరసగా యాక్టర్స్ చనిపోవడంతో ప్రేక్షకులు కూడా శోకసంద్రంలో మునిగిపోయారు.
Cinema Serial artist #SubiSuresh passed away..!!
Was in treatment for disease related to liver.
Shocking…!!!!
RIP 🙏🏻 pic.twitter.com/jq4gSPbz7X
— Arjun 🪓 (@ArjunVcOnline) February 22, 2023