హీరోయిన్ కియారా అడ్వాణీ రీసెంట్ గా పెళ్లి చేసుకుంది. హనీమూన్ కి కూడా వెళ్లొచ్చింది. ఆ తర్వాత కొన్ని ఫొటోలను పోస్ట్ చేసి క్రేజీ క్యాప్షన్ పెట్టుకొచ్చింది. ఇప్పుడు అదికాస్త వైరల్ గా మారింది.
సెలబ్రిటీలకు ఫాలోయింగ్ చాలా ఎక్కువే. మరీ ముఖ్యంగా హీరోయిన్లు.. పలు భాషల్లో సినిమాలు చేస్తే మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉంటారు. ఏ చిన్న ఫొటో, వీడియో పోస్ట్ చేసినా కామెంట్స్ తో చెలరేగిపోతుంటారు. ఇప్పుడు సేమ్ అలాంటి అనుభవమే హీరోయిన్ కియారా అడ్వాణీకి ఎదురైంది. గత కొన్నేళ్ల నుంచి కియారా-సిద్ధార్థ్ మల్హోత్రా రిలేషన్ లో ఉన్నారు. అలా ఆ బంధం నుంచి మరో అడుగు ముందుకేసి రీసెంట్ గానే అంటే ఫిబ్రవరి 7న పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత నుంచి ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అలానే జంటగా తీసుకున్న ఫొటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉన్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. అలియా అడ్వాణీ సినిమాల్లోకి వస్తుందనేసరికి తన పేరుని కియారాగా మార్చుకుంది. ‘ఫగ్లీ’ మూవీతో నటిగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘ధోనీ’తో ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. ‘భరత్ అను నేను’తో టాలీవుడ్ లోకి ఎంటరైంది. రామ్ చరణ్ తో ‘వినయ విధేయ రామ’ చేసింది. ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్ కే పరిమితమైపోయింది. కబీర్ సింగ్, షేర్షా, భూల్ భులయ్యా 2 లాంటి హిట్ సినిమాలతో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తూ వచ్చింది. నటిగా ఈమె కెరీర్ మంచి పీక్ స్టేజీలో ఉంది.
హీరోయిన్ గా బాలీవుడ్ లో వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న కియారా.. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో గత కొన్నేళ్ల నుంచి డేటింగ్ చేస్తోంది. దీని గురించి న్యూస్ లో రావడం తప్పితే అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. తాజాగా పెళ్లి చేసుకున్న ఈ జంట.. ఆ తర్వాత హనీమూన్ కి కూడా వెళ్లొచ్చారు. ఇప్పుడు కాస్త ఫ్రీ టైం దొరకడంతో పెళ్లి, సంగీత్ ఫొటోలను షేర్ చేస్తున్నారు. అలా కియారా కొన్ని ఫొటోలను పోస్ట్ చేస్తూ.. ‘సమ్ థింగ్ ఎబౌట్ దట్ నైట్.. సమ్ థింగ్ రియల్లీ స్పెషల్’ అని క్యాప్షన్ పెట్టింది. దీనికి ఫన్నీగా రియాక్ట్ అయిన పలువురు నెటిజన్స్.. ‘ఫస్ట్ నైట్ హా’ అని కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఇది కాస్త వైరల్ గా మారింది. మరి కియారా క్యాప్షన్ చూడగానే మీకేం అనిపించింది. కింద కామెంట్ చేయండి.