KGF-2 విడుదలై చాలా రోజులు గడిచిన ఆ సినిమా ప్రభావం ప్రేక్షకుల మైండ్ లో మాత్రం ఇంక లేదు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్, రాకింగ్ స్టార్ యశ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిచ్ సాధించిన ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్లలో కలెక్షన్స్ రాబడుతూనే ఉంది. కేజీఎఫ్-2 అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ఈ అద్భుత విజయం చిత్ర బృందలోని ప్రతి ఒకరి కృషి చాలా ఉంది. ఈ సినిమా ఎడిటింగ్, కెమెరా మెన్ పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. కేజీఎఫ్ సినిమాకు కెమెరా మెన్ గా పనిచేసిన భువన్ గౌడనుపై ప్రముఖల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భువన్ గౌడ.. కేజీఎఫ్-2 మేకింగ్ విషయాలతో పాటు పలు అంశాల గురించి షేర్ చేసుకున్నారు. కేజీఎఫ్-3 ఉందో, లేదో తనకి తెలియదని. ఒక వేళ ఉండి.. తను కెమెరా మెన్ గా తీసుకోకుంటే సూసైడ్ చేసుకుని చనిపోతాను అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్వ్యూలో భువన్ గౌడ మాట్లాడుతూ..” ప్రశాంత్ సార్ ది నాది ఓకే జర్ని. మా ఇద్దరిది ఉగ్రం నుంచి స్టార్ట్ అయింది. మా ఇద్దరి అభిప్రాయాం ఓకేలా ఉంటుంది. ఆయనకు తెలుసు నాతో ఎలా వర్క్ చేయించుకోవాలని. కేజీఎఫ్-3 చేస్తే అద్భుతంగా ఉంటుంది. కానీ నాకు తెలియదు. అది డైరెక్టర్ నే అడాగాలి. ఒక వేళ ఉంటే నేనే కెమెరా మెన్ ని. నేను లేదంటే సూసైడ్ చేసుకుంటా. నన్ను వదలి ఎలా చేస్తారు సినిమా. మా టీమ్ తో ఉండాలి. సినిమా విషయం పక్కన పెడితే. కేజీఎఫ్ టీమ్ అనేది ఓ ఫ్యామిలి. ప్రశాంత్ నీల్ గారు నాకు గాడ్ ఫాదర్ లాంటి వారు. నేను సినిమాటోగ్రఫీ ఉగ్రం సినిమాలోనే నేర్చుకున్నాను. ప్రశాంత్ నీల్ సార్ మైండ్ అనేది చిన్నపిల్లాడి మాదిరి ఉంటుంది”అంటూ పలు విషయాలు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.