ప్రస్తుతం ప్రశాంత్ నీల్ పేరు దేశవ్యాప్తంగా సినీ అభిమానుల నోట్లో నానుతున్న విషయం తెలిసిందే. కేజీఎఫ్ అనే సినిమాతో మొత్తం దేశంలో ఉన్న సినిమా అభిమానులందరినీ తన ఫ్యాన్స్ గా మార్తుకున్న విషయం తెలిసిందే. కేవలం మూడే మూడు సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్ గుర్తింపు సంపాదించుకున్నాడు. కేజీఎఫ్-2 సినిమా యావత్ దేశాన్ని షేక్ చేసిందనే చెప్పాలి. టాప్ గ్రాసింగ్ సినిమాల్లో మూడో స్థానాన్ని సాధించింది. కేవలం 100 కోట్ల బడ్జెట్ తో సినిమాని తెరకెక్కించి.. ప్రపంచవ్యాప్తంగా రూ.1,191 కోట్లు వసూళ్లు సాధించింది. ఇంకా బాక్సాఫీస్ వద్ద దండయాత్ర కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఖూషీగా ఉన్నారు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. ఇప్పుడు ఆ సినిమా నుంచి క్రేజీ లీక్ ఒకటి బయటకు వచ్చింది.
ఉగ్రం సినిమా నుంచి సినిమాటో గ్రాఫర్ భువన్ గౌడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కలిసి ట్రావెల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఒక స్టిల్ ఫొటోగ్రాఫర్ గా తన కెరీర్ ప్రారంభించిన భువన్ గౌడకు ప్రశాంత్ నీల్ సినిమాటోగ్రాఫర్ గా అవకాశం ఇచ్చాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న భువన్ గౌడ కేజీఎఫ్, కేజీఎఫ్-2, ఇప్పుడు సలార్ సినిమాకి కూడా సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా చూసిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ లో ఉత్సాహం రెట్టింపు అయ్యిందనే చెప్పాలి. కేజీఎఫ్ సినిమా చూసి సలార్ లో ప్రభాస్ కు ఉండే ఎలివేషన్స్, మాస్ సీన్లను ఇప్పటి నుంచే ఊహించేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు భువన్ గౌడ ఇచ్చిన లీకుతో ఆ సంబరాలు మరింత పెరిగాయనే చెప్పాలి.
ఇదీ చదవండి: రెండో పెళ్ళి చేసుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్..!అసలు సలార్ సినిమా గురించి భువన్ గౌడ ఇచ్చిన లీకు ఏంటంటే.. ‘సలార్ సినిమా రెండు, మూడు కెజీఎఫ్ లను కలిపి చూస్తున్నట్లు ఉంటుంది. అసలు కేజీఎఫ్ కి సలార్ కు సంబంధం ఉండదనే చెప్పాలి. సలార్ సినిమాను ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశారు. కేజీఎఫ్ సినిమాకి సలార్ సినిమాకి చాలా తేడా ఉంటుంది’ అంటూ సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు భువన్ కామెంట్స్ ని బట్టి చూస్తే ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ గట్టిగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా 2023లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 200 కోట్లతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ సరసన సలార్ లో శ్రుతిహాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే. భువన్ గౌడ ఇచ్చిన లీకులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.