హీరో సిద్ధార్థ్ KGF-2 మూవీ, పాన్ ఇండియా సినిమాలపై చేసిన తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. ‘ఎస్కేప్ లైవ్’ అనే వెబ్ సిరీస్ లో సిద్ధార్థ్ నటించిన విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ త్వరలో విడుదల కానుండగా యూనిట్ అంతా ప్రమోషన్ పాల్గొన్నారు. అయితే ఈ నేపథ్యంలో హీరో సిద్ధార్థ్ ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ KGF-2 మూవీ సక్సెస్, పాన్ ఇండియా సినిమాలపై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు.
నేను నటించిన సినిమాల్లో అన్ని భాషలకు డబ్బింగ్ నేనే చెప్పుకునే వాడినని తెలిపారు. ఇలాంటి సినిమాలను నేనైతే ఇండియన్ సినిమాలగానే పిలవాలనుకుంటానని అన్నారు. కానీ ఎందుకో నాకు పాన్ ఇండియా అంటుంటూ కొంచెం అగౌరపరిచినట్లుగా అనిపిస్తుంటుందని హీరో సిద్ధార్థ్ తన మనసులోని మాటలు బయటపెట్టారు. అలా అని ఈ వ్యాఖ్యలు ఒకరిని ఇబ్బంది పెట్టాలని మాత్రం చేయట్లేదని తెలిపారు.
ఇది కూడా చదవండి: Jeevitha Rajasekhar: నా కూతుళ్ల గురించి తప్పుగా రాశారు: జీవిత రాజశేఖర్మరో విషయం ఏంటంటే? సినిమా పరిశ్రమల్లో అధిక ప్రాధాన్యత ఉన్నది బాలీవుడ్ ఇండస్ట్రీ. అక్కడి నుంచి విడుదలైన సినిమాలు భారీ విజయాన్ని సాధిస్తే ఆ మూవీని హిందీ సినిమా అనే అంటారని అన్నారు. ఇక ప్రాంతీయ సినిమాలు భారీ విజయం సాధిస్తే ఎందుకు పాన్ ఇండియా అని పిలవడం? వాటిని భారతీయ చిత్రం అనొచ్చు కదా అంటూ సిద్దార్థ్ ముక్కుసూటిగా ప్రశ్నించారు. ఇకపోతే కేజీయఫ్ జర్నిని గౌరవించి కన్నడ సినిమా అని పిలవచ్చు అంటూ సిద్ధార్థ్ తెలిపారు.
ఇలా భారీ విజయాన్ని సాధించిన సినిమాలను పాన్ ఇండియా సినిమా అని కాకుండా ఇండియన్ ఫిలిం అని కూడా పిలవచ్చని తెలిపారు. పాన్ అంటే ఏంటో ఇప్పటికి కూడా నాకు అర్థం కావడం లేదని, ఆ పదం చాలా ఫన్నీగా ఉందంటూ హీరో సిద్ధార్థ్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. తాజాగా హీరో సిద్ధార్థ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. KGF-2 మూవీపై, పాన్ ఇండియా సినిమాలపై హీరో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.