స్వాతంత్ర్యం విషయంలో కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆమె వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. స్వాతంత్ర సమరయోధులను కించపరిచేలా కంగనా కామెంట్స్ ఉన్నాయంటూ విపక్షాలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ‘భారత్‌కు నిజమైన స్వాతంత్య్రం 2014లో వచ్చింది, 1947లో వచ్చింది భిక్ష మాత్రమే’ అంటూ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలను మరోసారి సమర్థించుకుంది కంగన. అంతేకాదు.. తాను చేసిన వ్యాఖ్యలు తప్పని నిరూపిస్తే ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తా అంటూ ఇన్ స్టా స్టోరీలో చెప్పుకొచ్చింది.
Love this from Kangana Ranaut! pic.twitter.com/W4Eck4qsG3
— Shefali Vaidya. 🇮🇳 (@ShefVaidya) November 10, 2021
కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన వ్యాఖ్యలను సమర్థించుకోవడమే కాదు.. పలు ప్రశ్నలు కూడా సంధించింది. ‘జస్ట్ టు సెట్ ది రికార్డ్స్ స్ట్రెయిట్’ అనే పుస్తకంలోని పేజీలు షేర్ చేస్తూ తన అభిప్రాయాలు, ప్రశ్నలను పోస్ట్ చేసింది. కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నది తానొక్కతే కాదని.. తాను ఇచ్చిన ముఖాముఖిలో స్పష్టంగా చెప్పినట్లు మరోసారి చెప్పింది. ‘రాణీ లక్ష్మీబాయి జీవితంపై తీసిన చిత్రంలో నేను నటించాను. ఆ సమయంలో 1857లో జరిగిన తొలి స్వాతంత్ర్య పోరాటంపై రీసెర్చ్ చేశాను. సుభాష్ చంద్రబోస్, రాణి లక్ష్మీబాయి, వీర్ సావర్కర్ లాంటి వారు ఎందరో ప్రాణ త్యాగం చేశారు. అప్పుడు పెరిగిన జాతీయవాదం.. ఒక్కసారిగా ఎందుకు తగ్గిపోయింది? భగత్‌సింగ్, నేతాజీ ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? వారికి గాంధీ ఎందుకు మద్దతివ్వలేదు? అంటూ ప్రశ్నించింది. ఈ ప్రశ్నలకు నేను సమాధానం తెలుసుకోవాలనుకుంటున్నాను. ‘1857లో జరిగిన యుద్ధం నాకు తెలుసు.. కానీ, 1947లో ఏం జరిగింది?. ఆ విషయం నాకు స్పష్టంగా చెబితే తప్పకుండా నా పద్మశ్రీని వెనక్కిస్తా.. అందరికీ క్షమాపణ చెబుతా’ అంటూ కంగన వ్యాఖ్యానించింది.
తన ఇంటర్వ్యూ పూర్తిగా చూడకుండా.. ఎడిటెడ్ వీడియోలను వైరల్ చేసి కామెంట్ చేస్తున్నారని కంగన చెప్పుకొచ్చింది. ‘ఫిజికల్‌గా మనకు స్వాతంత్ర్యం ఎప్పుడో వచ్చినా.. ఇండియన్స్ మనస్సాక్షికి మాత్రం 2014లో స్వేచ్ఛ దొరికిందని నేను ఆ ఇంటర్వ్యూలో చెప్పాను. ఇంగ్లీష్ మాట్లాడనందుకు, మారుమూల ప్రాంతాల నుంచి వచ్చినందుకు, మేడిన్ ఇండియా వస్తువులను ఎవరూ సిగ్గు పడటం లేదు. ఈ విషయాలన్నీ స్పష్టంగా వివరించాను. ఎడిటెడ్ వీడియోలు వైరల్ చేసి విమర్శిచడం కాదు.. మొత్తం ఎపిసోడ్ చూపించి మాట్లాడండి’ అంటూ వ్యాఖ్యానిచింది. అమరవీరులను అవమానించినట్లు నిరూపిస్తే పద్మశ్రీ వెనక్కిచ్చేస్తా అంటూ కంగనా తెలిపింది.
President Kovind presents Padma Shri to Ms Kangana Ranaut for Art. She is an Indian film actress and filmmaker, who is widely recognised as an actress par excellence. pic.twitter.com/xOqBAt1VoA
— President of India (@rashtrapatibhvn) November 8, 2021
#KanganaRanaut may think India got Independence in 2014 but this cannot be endorsed by any true Indian. This is an insult to millions of freedom fighters who gave up their lives so that present generations can live a life of self-respect & dignity as free citizens of a democracy. pic.twitter.com/o0EtH0hukU
— TIMES NOW (@TimesNow) November 12, 2021
#KanganaRanaut receives Padma awards from the President of India today.#Bollywood pic.twitter.com/8pItKbztD3
— Manish Shukla (@manishmedia) November 8, 2021