ప్రతి సంవత్సరం వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవానిరతిని కనబరిచిన వారికి ఇచ్చే ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలు ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలోని రాష్ట్రభవన్‌లో జరిగింది. 2020 సంవత్సరానికి ప్రకటించిన పద్మ పురస్కారాలను 2021, నవంబర్ 8న ప్రదానం చేశారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గ్రహీతలకు అవార్డులను అందజేశారు. కాగా, ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఇటీవలే భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి చేతుల మీదుగా జాతీయ ఉత్తమనటి పురస్కారం అవార్డును అందుకుంది.
ఇటీవలే భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి చేతుల మీదుగా జాతీయ ఉత్తమనటి పురస్కారం అవార్డును అందుకుంది. తాజాగా సోమవారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని తీసుకుంది కంగనా. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేసింది. ఒక కళాకారిణిగా, నేను అనేక అవార్డులు, సన్మానాలు, ప్రేమ మరియు కృతజ్ఞతలు అందుకున్నాను. మొట్టమొదటిసారిగా భారత ప్రభుత్వం తన సేవలను గుర్తించి తనపై నమ్మకంతో ఇంత గొప్ప పురస్కారాన్ని అందించినందుకు నేను రుణపడి ఉన్నానని అన్నారు.
నేను చిన్న వయసులో నటిగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన తర్వాత ఎంతో కాలానికి కానీ నాకు విజయం దక్కలేదు. ఒకసారి విజయం సాధించిన తర్వాత నాకంటూ కొన్ని సొంత అభిప్రాయాలను ఏర్పరుచుకుని ముందుకు సాగాను. పెద్ద హీరోలతో, పెద్ద నిర్మాణ సంస్థల తో తీసే సినిమాలన్నీ కూడా వదులుకున్నాను. ఐటమ్ సాంగ్స్ లో నటించకూడదని నిర్ణయం తీసుకున్నాను. ఒక దశలో నేను డబ్బులు కంటే ఎక్కువగా శత్రువులను సంపాదించుకున్నాను. లెక్కలేనన్ని కేసులు నమోదయ్యాయి. దేశానికి వ్యతిరేకంగా జరిగే చర్యలను నేను తట్టుకోలేను. నన్ను ఈ స్థానంలో నిలబెట్టిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చింది.