Kalyan Dev: విజేత సినిమాతో పరిశ్రమలోకి అడుగుపెట్టారు ‘కల్యాణ్ దేవ్’. 2018లో కెరీర్ ప్రారంభించిన ఆయన.. ఇప్పటి వరకు మూడు సినిమాలు చేశారు. తీసింది కొన్ని సినిమాలే అయినా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మొదటి సినిమాకే సైమా అవార్డును గెలుచుకుంటున్నారు. సినిమాకు సినిమాకు నటనను మెరుగుపరుచుకుంటూ.. స్టార్ హీరోగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. ఇక, కల్యాణ్ దేవ్‌కు తల్లి అన్నా.. కూతురు నవిష్క అన్నా చాలా ఇష్టం.
కొన్ని నెలల నుంచి సినిమా షూటింగులతో బిజీగా గడుపుతున్న ఆయనకు కొంత ఖాళీ సమయం దొరికింది. ఈ నేపథ్యంలో ఆయన దగ్గరికి కూతురు నవిష్క వచ్చేసింది. తనకెంతో ఇష్టమైన కూతురు తన దగ్గరకు చేరుకునే సరికి కల్యాణ్ దేవ్ సంతోషంలో మునిగిపోయారు. పాపతో కలిసి సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.
కాగా, కల్యాణ్ దేవ్ తల్లి పుట్టిన రోజు సందర్బంగా గతంలో తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో తల్లిని ఉద్ధేశిస్తూ.. ‘‘ పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మా!.. జీవితం కొన్నిసార్లు ఎంతో కష్టతరంగా మారుతుంది.. కానీ, నీ ప్రేమ వల్ల వచ్చే శక్తితో వాటిని ఎదుర్కొంటాననే నమ్మకం నాకుంది. నాకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నందుకు థాంక్యూ.. లవ్ యూ మా ‘ అంటూ భావేద్వేగానికి గురయ్యారు. మరి, కల్యాణ్ దేవ్‌తో నవిష్క ఉన్న వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : చేతిలో కర్పూరం వెలిగించుకుని.. స్టేజ్‌పైనే తాళి కట్టేసిన జబర్దస్త్ నూకరాజు!