తమ ప్రేమ ఎంత గొప్పదో అనే విషయాన్ని ఒక్కొక్కరూ ఒక్కో విధంగా నిరూపించుకుంటారు. విలువైన బహుమతులను బహుకరించి తమ ప్రేమను చాటుకునే వ్యక్తులు కొందరైతే.. ప్రేమించిన వారి కోసం ప్రాణాలను ఇచ్చేందుకు సిద్ధపడే ప్రేమికులు మరి కొందరు. తాజాగా జబర్దస్త్ కమెడియన్ నూకరాజు తన ప్రేమను నిరూపించుకునేందుకు ప్రాణాలని సైతం లెక్క చేయలేదు. తన ప్రేమ నిజమని నిరూపించుకోవడం కోసం అరచేతిలో కర్పూరం వెలిగించుకున్నారు. క్యాష్ షోలో భాగంగా ఈ అగ్ని పరీక్షకు సిద్ధమయ్యారు నూకరాజు. తాను ప్రేమించిన ఆసియా కోసం ఈ సాహసానికి ఒడిగట్టారు. 'నీది నిజమైన ప్రేమ అయితే కర్పూరం వెలిగించుకో' అని సుమ అనగానే.. నూకరాజు తన అరచేతి మీద కర్పూరం వెలిగించుకున్నారు. కర్పూరం పూర్తిగా కాలే వరకూ నూకరాజు వెనక్కి తగ్గలేదు. ఆసియా కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి. కర్పూరం పాడేయమని అంటున్నా.. చివరి వరకూ నూకరాజు అలానే మండుతున్న కర్పూరాన్ని అరచేతి మీద ఉంచుకున్నారు. ఆ తర్వాత సుమ తాళి కట్టమని అనగా.. తాళి కట్టేందుకు సిద్ధపడ్డారు. స్టేజ్‌పై అందరూ చూస్తుండగానే ఆసియా మెడలో తాళి కట్టబోతుండగా ప్రోమో ఎండ్ అవుతుంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. షో కోసం ఇలా ప్లాన్ చేశారని కొందరు కామెంట్స్ చేస్తుండగా.. నూకరాజుది నిజమైన ప్రేమ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ప్రియురాలిపై ఉన్న ప్రేమని నిరూపించుకోవడం కోసం నూకరాజు చేసిన సాహసంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: Ajith Kumar: షూటింగ్ ఛాంపియన్షివ్లో హీరో అజిత్ కి 4 బంగారు పతకాలు! ఇది కూడా చదవండి: ఓవైపు దీపికా పిల్లి.. మరోవైపు విష్ణుప్రియ.. ఊపేస్తున్న సుధీర్ సాంగ్!