జూనియర్ ఎన్టీఆర్ థ్రెడ్స్ యాప్‌లోకి జాయిన్ అయిన కొద్ది నిమిషాలకే వేలాది మంది ఫాలో అయ్యారు. ఇందులో ఇతర హీరోలు కూడా జాయిన్ కావాలని వారి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోస్ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటున్నారు. ట్వీట్టర్, ఫేస్ బుక్, ఇన్‌స్టా వేదికగా తమ అప్డేట్స్ మాత్రమే కాకుండా వ్యక్తిగత విషయాలను సైతం ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు లాంటి పాన్ ఇండియా స్టార్స్ దాదాపు అన్ని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలలో యాక్టివ్‌గా ఉంటారు. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగు పెట్టారు. అయితే ఇప్పుడు ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌కు పోటీగా మెటా అధినేత జూకర్ బర్గ్ సరికొత్తగా థ్రెడ్స్ అనే యాప్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ఈ థ్రెడ్స్ యాప్ ప్లే స్టోర్‌లో అందుబాటులోకి వచ్చింది. మొదటి రెండు గంటల్లోనే రెండు మిలియన్స్, నాలుగు గంటల్లో ఐదు మిలియన్స్, మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇక ఈ యాప్‌ను ఇప్పుడు సెలబ్రిటీస్ సైతం ఉపయోగించడం మొదలు పెట్టారు. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మొదటగా జూనియర్ ఎన్టీఆర్ థ్రెడ్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
కొత్త యాప్‌లో తారక్ జాయిన్ అవ్వడంతో అభిమానులు ఖుష్ అవుతున్నారు. తారక్ జాయిన్ అయిన కొద్ది నిమిషాలకే వేలాది మంది ఫాలో అయ్యారు. ఇందులో ఇతర హీరోలు కూడా జాయిన్ కావాలని వారి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తారక్ ‘దేవర’ షుటింగ్‌లో బీజీగా ఉన్నారు. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచానాలున్నాయి. జాన్వీ కపూర్ హారోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.