మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌తో వినయ విధేయ రామ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడింది ఇషా గుప్తా. హాటు అందాలతో ఘాటు పెంచే బాలీవుడ్ భామల్లో ఇషా గుప్తా ఒకరు. బాలీవుడ్ సినిమాల్లో అందాలను ఆరబోస్తూ మూతి ముద్దులను పెట్టేసినా స్టార్ హీరోయిన్‌గా బ్రేకు మాత్రం దక్కలేదు. అయితేనేం నాకు సోషల్ మీడియా అండ ఉందిగా అంటూ ఈషా గుప్తా హాటు ఫొటోలతో రెచ్చిపోతుంది.బాలీవుడ్ జన్నత్ బేబీ బికినీ డ్రెస్సులో తన అందాల్ని ఆరబోస్తోంది. రీసెంట్‌గా తన ఇన్‌స్టాగ్రామ్‌లో మరోసారి హాట్ ఫొటోను షేర్ చేసి కుర్రకారు మతులు పొగొట్టే ప్రయత్నాలు ప్రారంభించింది.
స్టన్నింగ్ పిక్స్ పోస్టు చేస్తున్న ఇషా తన ఫ్యాన్స్‌ను మత్తెక్కిస్తోంది. సన్‌బాతింగ్‌కు సంబంధించిన రెండు ఫోటోలను తన ఇన్‌స్టాలో బోల్డ్ బ్యూటీ ఇషా అప్‌లోడ్ చేసింది. బ్రౌన్ బికినీలో ఇషా తన షేప్‌తో కేక పుట్టిస్తోంది. ఆమె తన ఫోటోలు పోస్టు చేసిన క్షణాల్లోనే రెడ్ హార్ట్, ఫైర్ ఐకాన్లు పోటెత్తాయి. బేబీ వోవ్ అంటూ ఆమె ఫ్రెండ్స్ కామెంట్ చేశారు. లుకింగ్ సో హాట్ అంటూ కొందరు రియాక్ట్ అయ్యారు. గార్జియస్ అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు. ఇషా రెగ్యులర్‌గా తన ఫిట్‌నెస్ ఫోటోలు, వీడియోలను ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేస్తున్న విషయం తెలిసిందే.
యోగా చేస్తున్న వీడియోలను ఆమె తరుచూ పోస్టు చేస్తూనే ఉంటుంది. రుస్తుం, కమాండో 2, టోటల్ థమాల్, హమ్‌షాకల్స్ లాంటి చిత్రాల్లో ఇషా నటించింది. డెవిల్స్ డాటర్ అనే పర్షియన్ సినిమాలోనూ ఇషా గుప్తా నటించింది