కరోనా కాలంలో అన్నీ చేదు అనుభవాలే. అన్నీ చేదు వార్తలే. కానీ.., కష్టం వచ్చినప్పుడే ఆదుకునేవారు ఎవరో, ఆడుకునే వారు ఎవరో అర్ధం అవుతుంది అంటారు. ఇలాంటి సమయంలోనే నిజమైన సహృదయుల గొప్పతనం తెలుస్తుంది అంటారు. అచ్చం ఇలానే తన మంచి మనసుని చాటుకున్నారు ‘ఐ డ్రీమ్’ సంస్థ ఛైర్మెన్ చిన్న వాసుదేవ రెడ్డి. ‘ఐ డ్రీమ్’ లో ‘ఫ్రాంక్లి విత్ టి.ఎన్.ఆర్’ పేరుతో ఇంటర్వూస్ చేసిన తుమ్మల నరసింహ రెడ్డి కరోనాతో అకాలంగా కన్ను మూసిన విషయం తెలిసిందే. టి.ఎన్.ఆర్ మరణం తరువాత ఆయన కుటుంబానికి అని వైపుల నుండి మంచి సహకారం అందుతూ వచ్చింది. టి.ఎన్.ఆర్ ఫ్యామిలీ ఆర్ధిక కష్టాల్లో ఉందని తెలుసుకుని మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయలు సహాయం చేశారు. అలాగే.., హీరో సంపూర్ణేష్ బాబు కూడా రూ.50 వేల సహాయం అందించాడు. తాజాగా టి.ఎన్.ఆర్ కుటుంబాన్ని ఆదుకోవడానికి ‘ఐ డ్రీమ్’ సంస్థ ఛైర్మెన్ చిన్న వాసుదేవ రెడ్డి ముందుకి వచ్చారు. చిన్న వాసుదేవ రెడ్డి టీఎన్ఆర్ ఇంటికి వెళ్లి 10 లక్షల రూపాయల చెక్కును అందించారు. అంతేకాకుండా టీఎన్ఆర్ పిల్లల చదువుకు సంబంధించి పూర్తి బాధ్యతలు తానే తీసుకుంటున్నట్లు ప్రకటించారు. టి.ఎన్.ఆర్ కుటుంబ సభ్యులలో కొంత మందికి పాజిటివ్ ఉన్నా.., చిన్న వాసుదేవ రెడ్డి మాత్రం వాయఱి ఇంటికి వెళ్లే ఈ సహాయాన్ని అందించడం విశేషం. ఈ సందర్భంగా చిన్న వాసుదేవ రెడ్డి టి.ఎన్.ఆర్ తో తన అనుభవాలను పంచుకున్నాడు. టి.ఎన్.ఆర్ కేవలం మా సంస్థలో ఓ ఉద్యోగి మాత్రమే కాదు. అతను నా ఆత్మీయుడు. సంస్థ ఎదుగుదలకు ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చాడు. ఉన్నన్ని నాళ్ళు కష్టపడి పని చేశాడు. ఇలాంటి వ్యక్తిని కోల్పోవడం దురదృష్టకరం అని అన్నారు వాసుదేవ రెడ్డి . అలాగే భవిష్యత్ లో కూడా TNR పిల్లలను చదివించే బాధ్యత ‘ఐ డ్రీమ్’ తీసుకుందని ఆయన తెలియచేశాడు. ఇక వ్యక్తిగా TNR మనమధ్య లేకపోయినా ఆయన విడిచి వెళ్లిన జ్ఞాపకాలు, చేసిన కళాసేవ ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి’ అని ఎమోషనల్ పోస్టును షేర్ చేశారు ‘ఐ డ్రీమ్’ ఛైర్మెన్.