రజినీకాంత్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ జైలర్. బాక్సాఫీస్ బరిలో వసూల్ల వరద పారిస్తుంది. అన్ని చోట్ల పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది.
రజినీకాంత్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ జైలర్. బాక్సాఫీస్ బరిలో వసూల్ల వరద పారిస్తుంది. అన్ని చోట్ల పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. రజనీకాంత్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సన్నివేశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఆయన అభిమానులకు ఈ సినిమా ఫుల్ మీల్స్ అని చెప్పవచ్చు. ఈ సినిమాకు మరో హైలెట్ ఏంటంటే.. బ్యాగ్రౌండ్ స్కోర్.. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించాడు. అయితే జైలర్ కి కూడా అనిరుధ్ సంగీతం అందించాడు. ఇందులోని పాటలు ఇప్పటికే ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఈ సినిమా కలేక్షన్స్ గురించి నెట్టింట ఓ వార్త వైరల్ గా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వేళ్తే..
జైలర్ మూవీ విడుదల అయిన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ రావడంతో.. భారీగా కలెక్షన్స్ రాబడుతోంది. ఈ చిత్రం 4 రోజుల్లో 300 కోట్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. దీంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. జైలర్ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం హిందీ భాషల్లో రిలీజ్ అయ్యింది. జైలర్ సినిమాకు పోటిగా.. చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఒక్క రోజు వ్యవధిలో రిలీజ్ అయ్యింది, కానీ జనాలు మాత్రం జైలర్ వైపే మొగ్గు చూపుతున్నారు. రజనీకి సరైన హిట్ పడి చాలా కాలం అయ్యింది. ఆ గ్యాప్‌ని జైలర్‌తో బ్రేక్ చేశాడు సూపర్ స్టార్. ఈ సినిమాకు తక్కువ రోజుల్లో 300 కోట్లు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి.
ఈ మూవీ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టడానికి ముఖ్య కారణం నటీనటులే. ఈ సినిమాలో తమన్నా, మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, అలాగే తెలుగు నటుడు సునీల్ ఈ సినిమాలో ఉన్నారు. వీరందరు ఈ సినిమాకు ఫ్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇంతమంది పెద్దస్టార్స్‌ని పెట్టి దర్శకుడు నెల్సన్ బాగా డీల్ చేశాడని నెటిజన్లు అభినందిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని కలెక్షన్స్ రాబడుతోందని ట్రెడ్ వర్గాలు అంచన వేస్తున్నాయి. ఫ్యాన్స్ మాత్రం 500 కోట్లు రాబడుతుందని నెట్టింట మాట్లాడుకుంటున్నారు.