మలయాళీ ముద్దుగుమ్మ హనీ రోజ్, బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ తో మంచి గుర్తింపుతో పాటు సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. అమ్మడి అందచందాలకు మగజాతి అంతా ఫిదా అయిపోయారు.
మలయాళీ ముద్దుగుమ్మ హనీ రోజ్, బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ తో మంచి గుర్తింపుతో పాటు సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. అమ్మడి అందచందాలకు మగజాతి అంతా ఫిదా అయిపోయారు. అంతకుముందే తెలుగులో నటించినా ఈ సినిమాతోనే జనాల కళ్లల్లో పడింది. సాధారణంగా సినిమా హీరోయిన్లను షాపింగ్ మాల్స్ ఓపెనింగ్‌కి పిలుస్తుంటారు. కానీ హనీ రోజ్ మాత్రం సినిమాల కంటే ఎక్కువగా షాప్ ఓపెనింగ్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఆమెను చూడ్డానికి కుర్రాళ్లు ఎగబడుతుంటారు. ఇక సోషల్ మీడియాలో అమ్మడి ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లేటెస్ట్ ఫోటోషూట్స్, వీడియోస్ షేర్ చేస్తూ.. కుర్రకారుకి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంటుంది.
సినిమాల విషయానికొస్తే.. హనీ రోజ్ ప్రస్తుతం ‘రాహేలు’ (Rachel) అనే పాన్ ఇండియా ఫిలింలో మెయిన్ లీడ్‌గా చేస్తుంది. ఆనందిని బాల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ వీడియో రిలీజ్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతుంది. పోస్టర్లో గ్లామరస్‌గా కనిపిస్తూనే, సీరియస్ లుక్‌లో భయపెడుతుంది హనీ. కత్తి పట్టుకుని బీఫ్ మాంసం కొడుతుంది. ఆమె చుట్టూ దున్నపోతు తలకాయలు ఉన్నాయి. ఈ సినిమాలో తను బీఫ్ అమ్మే క్యారెక్టర్లో కనిపించనున్నట్లు తెలుస్తుంది. మలయాళం సినిమాల్లో బీఫ్ నేపథ్యం కానీ, దానికి సంబంధించిన సన్నివేశాలు కానీ నేచురల్‌గానే చూపిస్తుంటారు.
ఇక హనీ రోజ్ గెటప్ కూడా అక్కడి సినిమాల్లో మాదిరిగానే ఉంది. కాకపోతే పోస్టర్లో పైట లేకుండా కనిపించడంతో తన గ్లామరే హైలెట్ అయింది. క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో, పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న ‘రాహేలు’ ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఫస్ట్ లుక్‌లో హనీ రోజ్ని చూసి కొందరు ఫిదా అవుతుంటే.. మరి కొందరి దృష్టి మాత్రం బీఫ్ మీద పడింది. ఈ కారణంగా, ఇంకేమీ ఆలోచించకుండా ‘రాహేలు’ మూవీని బ్యాన్ చెయ్యండి అంటూ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. మూవీ టీం ఈ ఇష్యూ మీద ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.