ఆమె ఓ అజంతా శిల్పం. తరిగిపోని అందం ఆమె సొంతం. ఇండస్ట్రీలోకి వచ్చి ఇరవై ఏళ్లు దాటిపోయినా సరే ఇప్పటికీ అదే గ్లామర్ మెంటైన్ చేస్తూ వస్తోంది. ఈమెని పెట్టి పాన్ ఇండియా సినిమాలు కూడా తీస్తున్నారు. ఇక తెలుగు, తమిళ, హిందీ అనే తేడా లేకుండా అన్ని చోట్ల హీరోయిన్ గా చేసింది. కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. ఇక ఈ ఏడాది చివర్లో ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైపోయింది. మరి ఆమె ఎవరో గుర్తుపట్టారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. పైన ఫొటోలో స్కూల్ లో డ్రస్ లో క్యూట్ గా కనిపిస్తున్న చిన్నారి త్రిష. చెన్నై(ఒకప్పటి మద్రాసు)లో పుట్టిన త్రిష.. అక్కడే స్టడీస్ పూర్తి చేసింది. ఆ తర్వాత పలు ప్రింట్, టీవీ యాడ్స్ లో నటించింది. మిస్ ఇండియా 2001లో బెస్ట్ స్మైల్ అవార్డు కూడా గెలుచుకుంది. అయితే నటిగా మారకముందు క్రిమినల్ సైకాలజిస్ట్ కావాలని త్రిష అనుకుంది. కానీ ఓ మ్యూజిక్ వీడియోలో ఆయేషా టాకియాతో కలిసి నటించింది. ఆ తర్వాత ‘లెస లెస’ సినిమాతో నటిగా మారిపోయింది.
ఇక సిమ్రాన్ హీరోయిన్ గా నటించిన ‘జోడి’.. త్రిష కెరీర్ లో తొలుత రిలీజైన సినిమా. ఆ తర్వాత వరసగా తమిళంలోనే మౌనం పెసయాదే, మనసెల్లం, సామి, అలయి తదితర సినిమాలు చేసింది. ఇక తెలుగులో ‘నీ మనసు నాకు తెలుసు’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ ‘వర్షం’ సినిమా త్రిష కెరీర్ కి చాలా ప్లస్ అయింది. తెలుగులో ఓవర్ నైట్ స్టార్ డమ్ ని తెచ్చిపెట్టింది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, పౌర్ణమి, స్టాలిన్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, కృష్ణ, కింగ్, బుజ్జిగాడు లాంటి హిట్ సినిమాల్లో నటించింది.
ఇక హీరోయిన్ గా కెరీర్ డౌన్ అవుతుందనే టైంలో తమిళ సినిమా ’96’.. త్రిషని మరో రేంజ్ కు తీసుకెళ్లింది. ఇక దీని తర్వాత మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’లో కుందవి పాత్ర చేసింది. రీసెంట్ గానే ఈ సినిమా రిలీజ్ కాగా, ఇందులో ఆమె రోల్ కి ఫ్యాన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈమె మెయిన్ రోల్ లో చేసిన ‘రాంగీ’.. డిసెంబరు 30న థియేటర్లలోకి రానుంది. ఇదంతా పక్కనబెడితే త్రిష చిన్నప్పటి ఫొటోని మీలో ఎంతమంది గుర్తుపట్టారు.. దిగువన కామెంట్ చేయండి.