ఆమెని చూస్తే ఎవరైనా సరే ఫిదా అయిపోతారు. ఎందుకంటే పాల కంటే తెల్లగా ఉంటుంది. గ్లామర్ తో కట్టిపడేస్తుంది. చీర, మోడ్రన్ డ్రస్, బికినీ.. ఇలా ఏదైనా సరే ఆమె ముందు దిగదుడుపే. సినిమాల్లో హీరోయిన్ గ్లామర్ మాత్రమే చూపిస్తుంది అంటే మీరు పొరబడినట్లే. ఎందుకంటే యాక్టింగ్ తోపాటు డ్యాన్స్ లో కూడా ఇరగదీస్తుంది. తెలుగులో టాప్ డ్యాన్సర్లు అయిన ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లకు ధీటుగా స్టెప్పులేస్తుంది. ఇక ఏజ్ పెరిగినా సరే ఆమెకి మంచి మంచి పాత్రలు వస్తూనే ఉన్నాయి. హీరోయిన్ గా ఇంకా అదరగొడుతూనే ఉంది. మరి ఆమె ఎవరో గుర్తుపట్టారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి, ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నతమన్నా భాటియా. ముంబయిలో పుట్టిన ఈమె.. అక్కడే చదువు పూర్తి చేసింది. 13 ఏళ్ల వయసులోనే లీడ్ రోల్ లో ఓ సినిమా చేసింది. తెలుగులో ‘శ్రీ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కానీ అది ప్లాఫ్ కావడంతో పెద్దగా గుర్తింపు ఏం రాలేదు. ఇక శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ‘హ్యాపీడేస్’లో ఓ హీరోయిన్ గా చేసిన తమన్నాకు ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. కానీ అడపాదడపా చిన్న సినిమాలు చేసింది. ఇక సుకుమార్ తీసిన ‘100 % లవ్’ తో తమన్నా దశ తిరిగిపోయింది.
అప్పటి వరకు చిన్న సినిమాల్లో హీరోయిన్ గా చేసిన తమన్నా.. ఒక్కసారిగా స్టార్ అయిపోయింది. బన్నీ ‘బద్రీనాథ్’, రామ్ చరణ్ ‘రచ్చ’ చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత తెలుగు స్టార్ హీరోలందరితోనూ దాదాపు కలిసి పనిచేసింది. తమిళ, హిందీలోనూ పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం కథానాయికగా మాత్రమే కాకుండా నెగిటివ్ రోల్స్, వెబ్ సిరీసులు కూడా చేస్తూ వెళ్తోంది. మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’, సత్యదేవ్ ‘గుర్తుందా శీతాకాలం’లో తమన్నానే హీరోయిన్ గా చేస్తోంది. ఈ రెండు కూడా త్వరలో విడుదల కానున్నాయి. ఇక సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉండే తమన్నా.. హాట్ హాట్ పోజులతో రెచ్చగొడుతూనే ఉంటుంది.