హీరోయిన్, వాళ్ల పెళ్లి అనేది నెవర్ ఎండింగ్ టాపిక్. ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఏదో ఓ మ్యారేజ్ జరుగుతూనే ఉంటుంది. మరోవైపు ముద్దుగుమ్మల పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉంటాయి. అందులో కొన్ని నిజమవుతుండగా, మరికొన్ని మాత్రం రూమర్స్ అనే తేలిపోతుంటాయి. కానీ చాలావరకు మాత్రం దాదాపు అవి కరెక్ట్ అని తేలుతుంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకొంటున్నాం అంటే గత కొన్నాళ్ల నుంచి హీరోయిన్ తమన్నా మ్యారేజ్ గురించి న్యూస్ వస్తూనే ఉంది. అందుకు తగ్గట్లే ఆ భామ దీనిపై రెస్పాండ్ అయినా సరే పెళ్లి వార్తల్ని మాత్రం ఖండించలేదు. ఇప్పుడు మాత్రం తన ఇంట్లో కూడా పెళ్లి గురించి ఒత్తిడి చేస్తున్నారని మిల్కీ బ్యూటీ చెప్పేసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్స్ అనగానే హీరోలే గుర్తొస్తారు. కానీ వాళ్లతో పోటీపడి మరీ అదరగొట్టిన బ్యూటీ ఎవరైనా ఉన్నారంటే అది తమన్నా మాత్రమే. యాక్టింగ్ తో పాటు డ్యాన్స్ విషయంలోనూ కేక పుట్టించేది. ‘శ్రీ’ సినిమాతో పరిచయమైన ఆమె.. ‘హ్యాపీడేస్’తో గుర్తింపు తెచ్చుకుంది. ఇక ‘100%లవ్’ చిత్రం తర్వాత స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో పాటు యువ కథానాయకులతోనూ యక్ట్ చేస్తూ ఇప్పటికీ ఫామ్ లోనే ఉంది. తాజాగా ఆమె నటించిన సినిమా ‘గుర్తుందా శీతాకాలం’. కన్నడ హిట్ ‘లవ్ మాక్ టైల్’కు రీమేక్ గా తీసిన ఈ సినిమా.. డిసెంబరు 9న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ కు అటెండ్ అయిన తమన్నా.. తన పెళ్లి గురించి ఓపెన్ అయింది.
‘కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు నన్ను నేను స్టార్ అని అనుకోలేదు. అలా చూసుకోవాలని అనుకోవడం లేదు. ఓ మంచి నటిగా మాత్రమే చూసుకోవాలనుకుంటున్నాను. ఇలా ఉంటేనే ప్రేక్షకులకు కొత్తదనాన్ని ఇవ్వగలను. నా పాత్ర నిడివి దృష్టిలో పెట్టుకుని ఎప్పుడూ సినిమాలు చేయలేదు. స్టోరీలో నాలుగైదు సీన్స్ ఉన్నా సరే ఆ పాత్ర ప్రభావం బలంగా ఉంటే చాలు. ‘సైరా’లో నా రోల్ డ్యూరేషన్ చాలా తక్కువే. కానీ దాని ఎఫెక్ట్ కథలో చాలా బలంగా కనిపిస్తుంది. ఇక నా పెళ్లి గురించి బోలెడన్నీ వార్తలొచ్చాయి. కొన్ని మీడియా సైట్స్ లో నాకు పెళ్లి చేసేశారు. ఓ డాక్టర్ తో మ్యారేజ్ జరిగినట్లు కూడా రాసేశారు. త్వరలో ఓ బిజినెస్ మేన్ తో ఏడడుగులు వేస్తానని రూమర్స్ వచ్చాయి. పెళ్లి అనేది లైఫ్ లో చాలా స్పెషల్. దాన్ని ఓ అందమైన వేడుకలా చేసుకుంటాను. మా ఇంట్లో కూడా నన్ను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారు. అలాగని నన్ను తొందరపెట్టడం లేదు.’ అని తమన్నా చెప్పుకొచ్చింది.