మనలో చాలామందికి ఫేవరెట్ అయిన హీరోయిన్ సదా.. కన్నీళ్లు పెట్టుకుంది. ఓ వీడియోని పోస్ట్ చేసి మరీ తన బాధని షేర్ చేసుకుంది. ఇప్పుడు ఇది కాస్త వైరల్ గా మారిపోయింది.
‘వెళ్లవయ్యా వెళ్లు..’ ఈ డైలాగ్ వినపడగానే చాలామందికి గుర్తొచ్చేది సదానే. ‘జయం’తో హీరోయిన్ గా చాలా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత సినిమాలు చేసింది గానీ హిట్స్ అయితే కొట్టలేకపోయింది. అలా అలా డ్యాన్స్ షోలకు జడ్జిగా ఫేమ్ తెచ్చుకుంది. ఎప్పుడు నవ్వుతూ ఉండే సదా.. ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుని కనిపించింది. ఆ విషయాన్ని తట్టుకోలేకపోతున్నానని చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పుడు ఇదికాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇంతకీ సదా కన్నీటి పర్యంతం కావడానికి కారణమేంటి? ఏం జరిగింది?
అసలు విషయానికొస్తే.. ‘జయం’తో యమ క్రేజ్ తెచ్చుకున్న సదా ఆ తర్వాత ఎన్టీఆర్, విక్రమ్, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. ఈమె కెరీర్ లో గుర్తుంచుకోదగ్గ మూవీ అంటే ‘అపరిచితుడు’ మాత్రమే. అంతకు ముందు గానీ తర్వాత ఒక్కటంటే ఒక్క మూవీ కూడా సరైన హిట్ కొట్టలేకపోయింది. దీంతో హీరోయిన్ గా చాలానే చిత్రాల్లో నటించింది గానీ ఎందుకో ఈమెకు కలిసిరాలేదు. దీంతో ఢీ, బిగ్ బాస్ సూపర్ జోడీ లాంటి డ్యాన్స్ షోలకు జడ్జిగా చేసింది. ముంబయిలో ఓ రెస్టారెంట్ నడుపుతున్న సదా.. దాని విషయంలో ఏర్పడిన ఓ ప్రాబ్లమ్ గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది.
‘2019 ఏప్రిల్ 23న ఎర్త్ లింగ్స్ కెఫె స్టార్ట్ చేశాను. ఇది నా మొదటి బిజినెస్. దీన్ని నా కన్నబిడ్డలా చూసుకున్నాను. కానీ ఈ ఏప్రిల్ 23న నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే కెఫె ప్లేస్ ఓనర్ ఫోన్ చేసి ఖాళీ చేయాలని అన్నారు. నెల రోజులు మాత్రమే టైమ్ ఇచ్చారు. నాకైతే పెద్ద షాక్ తగిలినట్లయింది. కన్నీళ్లు వస్తున్నాయి. మూడు వారాల్లో మేం ఖాళీ చేయాలి. కెఫె కట్టడానికి ముందు ఈ ప్లేస్ చాలా దారుణంగా ఉంది. కొవిడ్ టైంలో ఇక్కడ రోజుకు 12 గంటలు పనిచేశాను. సంవత్సరమంతా కష్టపడి దీన్ని అందంగా తీర్చిదిద్దాను. ఇదే ప్రపంచంగా బతికాను. లాక్ డౌన్ లో బిజినెస్ సరిగా జరగకపోయినా అద్దె చెల్లించాను. ఇప్పుడు దీన్ని వదిలి వెళ్లాలంటే మనసు రావడం లేదు. తట్టుకోలేకపోతున్నాను. ఏదో కోల్పోతున్నట్లుగా ఉంది’ అని సదా కన్నీళ్లు పెట్టుకుంది. ఎప్పుడు నవ్వుతూ ఉండే సదా.. ఇలా కన్నీళ్లు పెట్టుకోవడం చూసి మీరేం అనుకున్నారు? కింద కామెంట్ చేయండి.