హీరోయిన్లు భలే క్యూట్ గా ఉంటారు. కొన్నిసార్లు అయితే ముద్దు పెట్టుకోవాలనేంత అందంగా ఉంటారు. అసలు అంత అందాన్ని ఎలా మెంటైన్ చేస్తుంటారబ్బా అనిపిస్తుంది. హీరోయిన్ అయిన తర్వాత ఎలానూ ఆ అందం ఉండేదే కానీ.. చిన్నప్పుడు కూడా అంతే అందంగా ఉంటారు. అప్పుడప్పుడు ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. అభిమానులని ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తుంటాయి. అయితే ప్రస్తుత గ్లామరస్ ఫొటోల కంటే కూడా అవే ట్రెండింగ్ లోకి వస్తుంటాయి. ఇప్పుడు కూడా టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరోయిన్ చిన్నప్పటి పిక్ వైరల్ గా మారింది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి రాశీఖన్నా. దిల్లీకి చెందిన ఈ భామ.. స్కూల్లో టాపర్. అన్ని విషయాల్లోనూ చురుగ్గా ఉండేది. యాక్టింగ్ పట్ల ఆసక్తి అస్సలు లేదు కానీ సింగర్ మాత్రం కావాలనుకుంది. అలానే చదువులో టాపర్ కావడంతో.. ఐఏఎస్ ఆఫీసర్ కావాలని అనుకుంది. కానీ డెస్టినీ మారిపోయింది. కాలేజీ డేస్ లో రాశీఖన్నా.. అడ్వర్టైజ్ మెంట్స్ కి కాపీ రైటర్ గా పనిచేసింది. అందంగా ఉండటంతో పలు యాడ్స్ లో నటించింది. అలా ‘మద్రాస్ కేఫ్’ అనే తమిళ సినిమాతో హీరోయిన్ గా మారిపోయింది. ఫస్ట్ మూవీతోనే మంచి పేరు సంపాదించింది.
ఇక రాశీఖన్నా బబ్లీ నెస్ చూసి డైరెక్టర్ కమ్ యాక్టర్ అవసరాల శ్రీనివాస్ కూడా ఫిదా అయ్యాడు. తను తీసిన ‘ఊహలు గుసగుసలాడే’లో హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. ఇలా తెలుగులోకి కూడా హిట్ తో రాశీ ఎంట్రీ ఇచ్చింది. అంతకు ముందు అక్కినేని మల్టీస్టారర్ ‘మనం’లో చిన్న అతిథి పాత్రలో అలా మెరిసింది. ఇక టాలీవుడ్ లో సుప్రీమ్, జై లవకుశ, రాజా ది గ్రేట్, తొలిప్రేమ, ప్రతిరోజూ పండగే లాంటి హిట్ సినిమాలతో పాటు చాలా చిత్రాలు చేసింది. తాజాగా డబ్బింగ్ చిత్రాలు ‘తిరు’, ‘సర్దార్’తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. ప్రస్తుతం ‘యోధ’ అనే సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. జోరు, బాలకృష్ణుడు, జవాన్, ప్రతిరోజూ పండగే సినిమాల్లో పాటలు పాడి సింగర్ కూడా అనిపించుకుంది. మరి రాశీఖన్నా క్యూట్ నెస్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.